కావాల్సినంత ఫైబర్.. గుడ్ బ్యాక్టీరియాకు సూపర్‌ఫుడ్.. వారానికి రెండుసార్లు గిన్నెడు తినండి చాలు..

ఆధునిక జీవనశైలిలో ఓట్స్ వినియోగం బాగా పెరిగింది. ఓట్స్‌లో ఉండే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్, కొలెస్ట్రాల్ నియంత్రణకు మరియు భోజనం తర్వాత రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా ఉండేందుకు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్‌లో భాగమైన ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యల విషయంలో సమతుల ఆహారంలో ఓట్స్‌ను చేర్చుకోవడం ఉపయోగకరంగా ఉండొచ్చు.

కావాల్సినంత ఫైబర్.. గుడ్ బ్యాక్టీరియాకు సూపర్‌ఫుడ్.. వారానికి రెండుసార్లు గిన్నెడు తినండి చాలు..
Oats Benefits

Updated on: Sep 09, 2026 | 12:34 PM

ఆధునిక జీవనశైలిలో ఓట్స్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల చాలా మంది తెలుసుకోవడం ద్వారా.. వీటి వినియోగం మరింత పెరిగింది. ముఖ్యంగా ఇతర దేశాల ఆహార అలవాట్ల ప్రభావంతో, పదిహేను సంవత్సరాల నుండి మన దేశంలో ఓట్స్ వాడకం విపరీతంగా పెరిగిందని డైటీషియన్లు చెబుతున్నారు.. పాలల్లో కలిపి లేదా నీళ్లల్లో ఉడికించి ఓట్స్ ను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఈ పెరుగుతున్న వినియోగం వెనుక ఓట్స్ అందిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

ఓట్స్ – వాటి ఆరోగ్య ప్రయోజనాలు..

ఓట్స్ వినియోగం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడము, చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటము.. మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు అదుపులోకి రావడము వంటివి పరిశోధనల ద్వారా రుజువయ్యాయి. వారానికి కేవలం రెండు రోజులు రెండు కప్పుల ఓట్స్ తీసుకోవడం ద్వారా వారమంతటికీ చెడు కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలు పెరగకుండా నియంత్రించబడుతున్నాయని చెబుతున్నారు. రెండు రోజుల వినియోగం వల్ల నెలన్నర పాటు ఈ ప్రయోజనాలు కొనసాగుతాయని, దీనికి ఓట్స్ లోని ఫైబర్ కీలకపాత్ర పోషిస్తుందని వివరిస్తున్నారు.

మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?..

మెటబాలిక్ సిండ్రోమ్ అనేది జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే నాలుగు రకాల సమస్యల సమూహం. ఊబకాయం (Obesity), అధిక రక్తపోటు (BP), మధుమేహం (షుగర్), అధిక కొలెస్ట్రాల్.. ఈ నాలుగు సమస్యలు ఒకేసారి ఉన్నప్పుడు దానిని మెటబాలిక్ సిండ్రోమ్ గా పరిగణిస్తారు.

ఓట్స్ ఎలా సహాయపడతాయి?

ఓట్స్ లో సుమారు 14-15% అధిక పీచుపదార్థం (ఫైబర్) ఉంటుంది.. ఇది ఇతర ధాన్యాల కంటే ఎక్కువ. ఈ ఫైబర్ ప్రేగుల్లోకి చేరి అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియా (గుడ్ బ్యాక్టీరియా)కు ఆహారంగా పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడం వల్ల అసిటేట్, బ్యూటిరేట్, ప్రొపియోనేట్ వంటి కొన్ని ఉపయోగకరమైన ఆమ్లాలు విడుదలవుతాయి. ఈ ఆమ్లాలు రక్తంలో కలిసి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికే కాకుండా, బీపీని నియంత్రించడానికి, డయాబెటిస్ ను అదుపు చేయడానికి, ఊబకాయాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

పరిశోధనల ప్రకారం, ఓట్స్ లోని ఫైబర్ మనం తీసుకున్న ఆహారంలోని కొలెస్ట్రాల్ ను శరీరం గ్రహించకుండా చేస్తుంది. అంతేకాకుండా, పిండిపదార్థాలు జీర్ణమైన తర్వాత చక్కెర రక్తంలోకి వేగంగా విడుదల కాకుండా నియంత్రిస్తుంది. విడుదలైన చక్కెరను కూడా నెమ్మదిగా రక్తంలోకి వెళ్ళేలా చూస్తుంది. ఈ ప్రక్రియలన్నీ ఒబేసిటీ, అధిక కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ వంటి సమస్యలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఓట్స్ కేవలం కొలెస్ట్రాల్ నియంత్రణకే కాకుండా, మెటబాలిక్ సిండ్రోమ్ లో భాగమైన ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు. వారానికి రెండు కప్పుల ఓట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఈ అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ ను పాలల్లో లేదా నీళ్లల్లో ఉడికించి అన్నంలాగా తినవచ్చు. ఆరోగ్యకరమైన, సంపూర్ణ జీవనశైలికి ఓట్స్ ఒక ముఖ్యమైన భాగమని.. తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us