మీ పిల్లలు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..? ఫోన్ తీసుకోకుండానే వారిని ఎలా మార్చాలో ఇప్పుడే తెలుసుకోండి..!

ఇప్పటి కాలంలో పిల్లలు మొబైల్‌ కి బానిసలవ్వడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఫోన్ లాక్కోవడం సమస్యకు పరిష్కారం కాదు.. దానికి బదులు కొత్త విషయాలపై ఆసక్తి కలిగించే వాతావరణం సృష్టించాలి. ఆటలు, హాబీలు, పుస్తకాలు, బయట గేమ్స్ ద్వారా పిల్లల్ని మొబైల్‌కి దూరం పెట్టవచ్చు.

మీ పిల్లలు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా..? ఫోన్ తీసుకోకుండానే వారిని ఎలా మార్చాలో ఇప్పుడే తెలుసుకోండి..!
Kids Screen Time

Updated on: Aug 31, 2025 | 9:27 PM

పిల్లలు మొబైల్‌కు బానిసలు అవ్వకుండా చూడటం ఈరోజుల్లో తల్లిదండ్రులకు ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఫోన్ లాగేసుకోవడం కాదు.. పిల్లలు ఫోన్‌వైపు చూడకుండా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడమే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఫోన్ లాగేసుకోవడం ఎందుకు కరెక్ట్ కాదు..?

ఈ డిజిటల్ ప్రపంచంలో ఫోన్‌ ను పిల్లల జీవితాల నుంచి పూర్తిగా దూరం చేయడం దాదాపు అసాధ్యం. చదువుతో సహా అనేక పనులకు ఇప్పుడు టెక్నాలజీ అవసరం. అంతేకాకుండా ఏదైనా వస్తువును లాగేసుకుంటే అది తమ హక్కు అనే భావన పిల్లల్లో పెరిగి వారు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. అందుకే ఇది చేయవద్దు అని చెప్పే బదులు.. దీనికి బదులు ఇది చేయండి అని ప్రోత్సహించడం మంచిది.

కొత్త విషయాలపై ఆసక్తి పెంచడం ఎలా..?

  • పిల్లల నుంచి ఫోన్‌ లాక్కునే బదులు.. వారి జీవితంలో ఉత్సాహం కలిగించే కొత్త విషయాలను పరిచయం చేయాలి.
  • ఆటలు.. బయట ఆడుకోవడం లేదా స్విమ్మింగ్ లాంటివి నేర్పించడం.
  • హాబీలు.. పాటలు, డ్యాన్స్ లేదా ఏదైనా కొత్త కళ నేర్చుకునేలా ప్రోత్సహించడం.
  • పుస్తకాలు.. వారికి ఇష్టమైన కథల పుస్తకాలను కొనివ్వడం.

పిల్లలకు ఎలాంటి వాతావరణం ఇస్తున్నామో ఆలోచించడం చాలా ముఖ్యం. సాంకేతికత లేని పాత రోజుల్లో మనం ఎలా ఆడుకున్నామో వారికి చెప్పండి. ఇసుకలో ఆడుకునే అవకాశం, స్విమ్మింగ్ నేర్చుకునే అవకాశం వంటివి వారికి కల్పించండి. అలాంటి వాతావరణం ఉంటే వారికి ఫోన్‌తో పని ఉండదు, వారు దాన్ని అవసరం అని భావించరు.