నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టవ్‌ను తళతళ మెరిపించే ట్రిక్.. ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఇలా చేస్తే చాలు..

రోజూ వంట చేయడం ఒకెత్తయితే.. ఆ తర్వాత స్టవ్‌పై పేరుకుపోయే జిడ్డు, నూనె మరకలను వదిలించడం మహిళలకు మరో ఎత్తు. ఎంత రుద్దినా వదలని ఆ మొండి మరకలను ఈజీగా తరిమికొట్టే ట్రిక్స్ గురించి చాల మందికి తెలియదు. ఇంట్లోనే ఉండే ఆ రెండు వస్తువులతో స్టవ్‌ను నిమిషాల్లోనే కొత్తదానిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమిషాల్లోనే మీ గ్యాస్ స్టవ్‌ను తళతళ మెరిపించే ట్రిక్.. ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఇలా చేస్తే చాలు..
How To Clean Stove Grates Easily

Updated on: Jun 19, 2026 | 4:55 PM

వంటగదిలో గ్యాస్ స్టవ్ మరకలు మహిళలకు ఎక్కడాలేని చికాకు తెప్పిస్తాయి. వంట వండడం ఒక ఎత్తైతే.. గ్యాస్ స్టవ్ క్లీనింగ్ మరో ఎత్తు. నూనె మరకలు, కూర మరకలు గ్యాస్ స్టవ్‌లు కొన్ని రోజుల్లోనే జిడ్డుగా మారుతుంటాయి. ముఖ్యంగా స్టవ్ పైభాగంలో స్టాండ్ మురికిని ఎక్కువగా పట్టుకుంటాయి. జిడ్డుగా మారిన వీటిని గంటల తరబడి సబ్బులతో రుద్ది శుభ్రం చేయడం మహిళలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే ఎలాంటి కఠినమైన కెమికల్స్ వాడకుండా, ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే వీటిని సులభంగా కొత్తవాటిలా మెరిపించవచ్చు.

బేకింగ్ సోడా, వెనిగర్ కాంబినేషన్.. మురికికి చెక్

స్టవ్‌ల నుండి మొండి జిడ్డును వదిలించడానికి మన వంటగదిలో దొరికే బేకింగ్ సోడా, వెనిగర్ అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి రసాయన రహితంగా, చేతులకు ఎలాంటి హాని చేయకుండా మురికిని చాలా సులభంగా వదులు చేస్తాయి.

ఇలా సులభంగా శుభ్రం చేయండి

స్టెప్ 1: ముందుగా స్టవ్ పూర్తిగా చల్లారిన తర్వాత పైభాగంలో ఉన్న స్టాండ్‌ను జాగ్రత్తగా విడిగా తీసి ఒక పెద్ద పాత్ర లేదా బేసిన్‌లో ఉంచండి.

ఇవి కూడా చదవండి

స్టెప్ 2 : వాటిపై మురికి ఎక్కువగా ఉన్న భాగాల్లో సరిపడా బేకింగ్ సోడా చల్లండి. ఆ తర్వాత దానిపై నెమ్మదిగా వెనిగర్ పోయండి. ఈ రెండు పదార్థాలు కలిసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి నురుగు వస్తుంది. ఈ నురుగే మొండి జిడ్డును పట్టు వదిలేలా చేస్తుంది.

స్టెప్ 3: ఈ స్థితిలో ఆ చిన్న స్టాండ్‌లను కొన్ని గంటల పాటు లేదా మరీ మొండి మరకలు ఉంటే రాత్రంతా అలాగే నాననివ్వండి.

స్టెప్ 4: బాగా నానిన తర్వాత వాటిని బయటకు తీసి, ఒక మృదువైన బ్రష్ లేదా స్పాంజ్‌తో లైట్‌గా రుద్దండి. ఎక్కువ బలాన్ని ఉపయోగించి శ్రమపడాల్సిన అవసరం లేకుండానే.. నూనె మరకలు, మాడిన కణాలు సులభంగా ఊడిపోతాయి. చివరగా మంచి నీటితో కడిగితే స్టవ్ గ్రేట్స్ కొత్తవాటిలా మెరుస్తాయి.

ఇలా చేస్తే సమయం ఆదా..

మీ స్టవ్ స్టాండ్‌లను నెలకు ఒకసారి లేదా అవసరమైనప్పుడు ఈ పద్ధతిలో క్లీన్ చేయడం వల్ల మొండి మరకలు శాశ్వతంగా పేరుకుపోయే అవకాశం ఉండదు. రోజువారీ వంట ముగిసిన తర్వాత చిన్నపాటి క్లీనింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకుంటే.. పెద్ద ఎత్తున శ్రమపడాల్సిన అవసరం తగ్గుతుంది.

ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఇది ఒక చక్కని ప్రాక్టికల్ సొల్యూషన్. ఈ సింపుల్ ట్రిక్ మీ స్టవ్‌ను కొత్తదానిలా మార్చడమే కాకుండా మీ కిచెన్ యొక్క హైజీన్‌ను కూడా మెరుగుపరుస్తుంది.

Follow Us