మీ పొట్టలో ఏముందో మీ మలం చెబుతుంది.. తాజా అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..

మలవిసర్జన గురించి బహిరంగంగా చర్చించడానికి మనం ఇబ్బంది పడవచ్చు. కానీ మన ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో ఇది అత్యంత కీలకమైన అంశం. మీరు టాయిలెట్‌కు వెళ్లే టైమ్ మీ ప్రేగుల్లోని బ్యాక్టీరియాను ఎలా మారుస్తుంది? దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది? అనే విషయాలు తెలుసుకుందాం..

మీ పొట్టలో ఏముందో మీ మలం చెబుతుంది.. తాజా అధ్యయనంలో విస్తుపోయే విషయాలు..
Is Your Pooping Habit Linked To Chronic Diseases

Updated on: Apr 20, 2026 | 7:02 AM

మనం రోజుకు ఎన్నిసార్లు మలవిసర్జన చేస్తామనేది కేవలం మన వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, అది మన మొత్తం ఆరోగ్యానికి ఒక దిక్సూచి వంటిది. 2024లో జరిగిన ఒక ధ్యయనం ప్రకారం.. మలవిసర్జన చేసే తరచుదనం మీ పెద్దప్రేగులో ఉండే సూక్ష్మజీవుల రకాన్, అవి చేసే పనులను నేరుగా ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మైక్రోబయోమ్ అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది..?

మన జీర్ణవ్యవస్థలో బిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని సమిష్టిగా గట్ మైక్రోబయోమ్ అని పిలుస్తారు. ఇవి కేవలం ఆహారాన్ని అరిగించడమే కాకుండా శరీరానికి కావాల్సిన పోషకాలను సంగ్రహించడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పరిశోధనలో తేలిన ఆసక్తికర విషయాలు

దక్షిణ కొరియాలోని సెజోంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో మలవిసర్జన అలవాట్ల ఆధారంగా ప్రజలను మూడు సమూహాలుగా విభజించారు. వారి పరీక్షల్లో తేలిన ఫలితాలు ఇవే..

క్రమబద్ధమైన అలవాటు: రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మలవిసర్జన చేసే వారిలో బాక్టీరాయిడ్స్ అనే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంది. ఇవి ఊబకాయాన్ని తగ్గించడానికి మరియు బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడతాయని జంతువులపై జరిపిన ప్రయోగాలు చెబుతున్నాయి.

తక్కువ తరచుదనం: వారానికి 1 నుండి 3 సార్లు మాత్రమే మలవిసర్జన చేసే వారి ప్రేగుల్లో రుమినోకాకస్ వంటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నాయి. మలం ప్రేగుల్లో ఎక్కువ సేపు ఉండటం వల్ల బ్యాక్టీరియా అక్కడ పులియబెట్టే ప్రక్రియను చేపడుతుంది. ఇది పేగు వాతావరణాన్ని మారుస్తుంది.

ఆరోగ్య పరిణామాలు

మలవిసర్జన సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో కొన్ని విషతుల్య పదార్థాలు విడుదలవుతాయి. దీనివల్ల కలిగే ప్రమాదాలు..

దీర్ఘకాలిక వ్యాధులు: మూత్రపిండ, హృదయ సంబంధ వ్యాధుల ముప్పు పెరగవచ్చు.

నాడీ సంబంధ సమస్యలు: నెమ్మదిగా జరిగే మల విసర్జన పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత రుగ్మతలతో కూడా ముడిపడి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

మెటబాలిజం: ఆహారంలోని ప్రోటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, ఇది మీ జీవక్రియను ప్రభావితం చేస్తుంది.

నిపుణుల సలహా

ఆహారం, నీరు తాగడం, వ్యాయామం మరియు నిద్ర వంటి జీవనశైలి మార్పులు మీ మలవిసర్జన క్రమాన్ని మెరుగుపరుస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు క్రమబద్ధంగా మలవిసర్జన చేసే వ్యక్తులు మిగిలిన వారికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us