శరీరంపై దుమ్ము, దూళి, క్రిములు తొలగించుకునేందుకు.. ఫ్రెష్ అయ్యేందుకు డైలీ స్నానం చేస్తుంటాం. కొంతమంది రోజుకు ఒక్కసారి చేస్తే.. మరొకొందరు మాత్రం 2 సార్లు చేస్తారు. అయితే చాలా ఫ్యామిలీలోని సభ్యులందరూ ఒకే సోప్ యూజ్ చేస్తుంటారు. ఇలా చేస్తున్నవారు అలెర్ట్ అవ్వాల్సిందే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. లేకుంటే.. అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారని హెచ్చరిస్తున్నారు.
సబ్బులు మన శరీరాన్ని క్లీన్ చేస్తాయి. కానీ, వాటిని అవి శుభ్రం చేసుకోలేవు. మనం సబ్బుతో స్నానం చేసినప్పుడు శరీరంపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్ సబ్బుపైకి చేరి దానిపై అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. చాలా రీసెర్చ్‌లు ఇదే అంశాన్ని నొక్కి చెబుతున్నాయి. నిజానికి సబ్బు అనేది ఒక క్లెన్సింగ్ ఏజెంట్ కాబట్టి.. దాన్ని జెర్మ్స్ ఏం చేయలేవని మనం అనుకుంటాం. కానీ, 2006లో ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక రీసెర్స్ ప్రకారం.. కొన్ని వాడిన సబ్బులను టెస్ట్ చేసినప్పుడు వాటిపై వివిధ రకాల సూక్ష్మజీవులను గుర్తించారు.
ముఖ్యంగా షిగెల్లా, ఈ కోలి, సాల్మోనెల్లా లాంటి డేంజరస్ బ్యాక్టీరియాతోపాటు స్టాఫ్, నోరో, రోటా వంటి వైరస్‌లు కూడా ఉన్నయని వివరించారు. కాబట్టి ఒకరు వాడిన సబ్బులు మరొకరు వాడినప్పుడు వాటి మీద అతుక్కుపోయిన క్రీములు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే చాన్స్ ఉంటుంది. ఏవైనా గాయాలైనప్పుడు ఒకరు వాడిన సబ్బుతో ఆ గాయాలను కడిగినప్పుడు ఈ జెర్మ్స్ ఒకరి నుంచి మరొకరి వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. మీరు సబ్బు పెట్టె యూజ్ చేస్తున్నట్లయితే.. అందులో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. అవకాశం ఉంటే సబ్బుకి బదులుగా లిక్విడ్ హ్యాండ్ సోప్, లిక్విడ్ బాడీ వాష్ వాడటం బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. అలానే టవల్స్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.. ఒకరి యూజ్ చేసేవి మరొకరు వాడకూడదు అన్నది వైద్యుల సూచన.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..