DIY Hacks: కేవలం రూ.1 ఖర్చుతో తేళ్లు, శతపాదుల సమస్యకు చెక్ పెట్టండి..!

వర్షాకాలంలో తేళ్లు, శతపాదులు లాంటి పురుగుల సమస్య ఎక్కువవుతుంది. వీటిని పోగొట్టడానికి ఖరీదైన కెమికల్ స్ప్రేలు అవసరం లేదు. కేవలం రూ.1 షాంపూ ప్యాకెట్‌తోనే ఈ సమస్యను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. షాంపూ స్ప్రే వాడితే పురుగులు దూరం కావడమే కాకుండా మీ ఇల్లు సేఫ్‌గా ఉంటుంది.

DIY Hacks: కేవలం రూ.1 ఖర్చుతో తేళ్లు, శతపాదుల సమస్యకు చెక్ పెట్టండి..!
Centipede Scorpion

Updated on: Aug 19, 2025 | 4:06 PM

వర్షాకాలంలో తేళ్లు, శతపాదులు లాంటి పురుగుల బెడద ఎక్కువవుతోంది. ఇవి ఎక్కువగా తడి, చీకటి ఉండే ప్రదేశాల్లో దాక్కుంటాయి. వీటిని తరిమికొట్టడానికి ఖరీదైన కెమికల్ స్ప్రేలు వాడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క రూపాయి షాంపూ ప్యాకెట్‌ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ సింపుల్ ట్రిక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

రూ.1 షాంపూ ప్యాకెట్‌ని ఎలా వాడాలి..?

ఒక స్ప్రే బాటిల్‌లో సగం లీటర్ నీరు పోయండి. అందులో ఒక చిన్న షాంపూ ప్యాకెట్ వేసి బాగా కలపండి. అంతే..! మీ పురుగుల మందు స్ప్రే రెడీ అయిపోయింది.

ఈ స్ప్రేని ఇంట్లో తేమ ఎక్కువగా ఉండే చోట, బాత్రూం పైపుల దగ్గర, వంటింటి మూలల్లో, వాష్ బేసిన్ చుట్టూ, చీకటి మూలల్లో స్ప్రే చేయండి. ముఖ్యంగా తేళ్లు, శతపాదులు దాక్కునే ప్రదేశాల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది.

షాంపూ ఎందుకు పనిచేస్తుంది..?

షాంపూలోని కొన్ని రసాయనాలు పురుగుల శరీరంపై ఉండే రక్షణ పొరను దెబ్బతీస్తాయి. అలాగే వాటికి ఊపిరి ఆడకుండా చేసి చనిపోయేలా చేస్తాయి. అంతేకాకుండా షాంపూ వాసన పురుగులకు అస్సలు నచ్చదు. ఆ వాసన పీల్చగానే అవి ఆ ప్రదేశం నుంచి దూరం పారిపోతాయి. ఈ విధంగా తక్కువ ఖర్చుతో పురుగుల సమస్యను నివారించవచ్చు.

ఖరీదైన స్ప్రేలు కొనాల్సిన పనిలేకుండా.. కేవలం ఒక రూపాయి షాంపూ ప్యాకెట్‌ తో శతపాదులు, తేళ్లు లాంటి పురుగుల బెడదను తగ్గించవచ్చు. ఈ వర్షాకాలంలో మీ ఇంటిని పురుగుల నుంచి సురక్షితంగా ఉంచుకోవడానికి ఇది ఒక సింపుల్, ఎఫెక్టివ్ మార్గం.