
ప్రస్తుతం బీజీ లైఫ్‌లో చాలా మంది సరైన పోషకాహారం తీసుకోవడమే మానేశారు. దీని వల్ల చాలా మంది రక్తహీనత, జుట్టు రాలడం, నీరసం వంటి అనేక ఆరోగ్య సమస్యల భారీన పడుతున్నారు. ఈ సమస్యలను తగ్గించుకునేందుకు హాస్పిటల్స్ చుట్టూ వేలకు వేలకు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇవేవి అవసరం లేకుండా మన పూర్వీకులు అందించిన సాంప్రదాయ వంటకాలతోనే ఈ సమస్యలను తగ్గించుకోవ్చని చాలా మందికి తెలియదు. అవును మన పూర్వికులు తిన్న రాగులు, సద్దలే వారిని బలంగా ఉండేలా, ఎక్కవ కాలం జీవించేలా చేశాయి. అలా వారు తిన్న వాటిలో రాగి రొట్టె కూడా ఒకటి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ సంప్రదాయ వంటకాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
రాగి తీపి రొట్టెకు కావలసిన పదార్థాలు
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో బెల్లం తురుము తీసుకుని, కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టుకోవాలి . ఇప్పుడు వడకట్టిన బెల్లం నీటిలో రాగి పిండి, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, రొట్టెలా ఒత్తుకోవడానికి వీలుగా మెత్తగా ఉండాలి.
తర్వాత ఒక అరటి ఆకు లేదా ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిగా నెయ్యి రాసి, చిన్న పిండి ముద్దను తీసుకుని పల్చని రొట్టెలా చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడయ్యాక, కాస్త నెయ్యి వేసి రొట్టెను రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే! ఎంతో రుచికరమైన, పోషకాల గని అయిన రాగి తీపి రొట్టె సిద్ధం.
ప్రయోజనాలు
నీరసంగా ఉన్నప్పుడు ఈ రొట్టె తింటే తక్షణమే శరీరానికి శక్తి లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్ లాగా ఈ రొట్టెలను తీసుకుంటే మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులను మీరు గమనించవచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది ఒక పరిపూర్ణ ఆహారం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.