ఇంట్లోనే చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు.. ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే..

ఉసిరి ఆరోగ్యానికి సంజీవనిలాంటిదని అందరికీ తెలుసు. అయితే మార్కెట్లో కొనడం కాకుండా, మీ ఇంటి బాల్కనీలోనో లేదా డాబాపైనో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు కాస్తే ఆ కిక్కే వేరు కదా.. దీని కోసం పెద్ద స్థలం అక్కర్లేదు.. చిన్న కుండీ ఉంటే చాలు. కానీ విత్తనం నాటితే కాయలు వస్తాయా? లేక నర్సరీ మొక్క తేవాలా? ఇంట్లోనే సులభంగా ఉసిరి మొక్కను పెంచి బోలెడన్ని కాయలు పొందే సింపుల్ ట్రిక్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లోనే చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు.. ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే..
How To Grow Amla Plant In Pots At Home

Updated on: Oct 22, 2026 | 5:12 PM

ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేసే ఉసిరిప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఖజానాగా, కేశ సంరక్షణకు దివ్యౌషధంగా పేరుగాంచిన ఉసిరిని ఇంట్లోనే సొంతంగా పెంచుకోవాలనే ఆసక్తి పెరటి చాలామందిలో పెరుగుతుంది. ఉసిరి చెట్టు అనగానే పెద్ద తోటలు, విశాలమైన స్థలం ఉండాలని చాలామంది భావిస్తుంటారు. అయితే సరైన కుండీ, తేలికపాటి మట్టి మిశ్రమం, తగినంత సూర్యరశ్మి ఉంటే చాలు.. డాబాపై లేదా బాల్కనీలోని కుండీల్లోనే ఉసిరి మొక్కను ఏపుగా పెంచి కాయలు పొందవచ్చు. ఇంటి వద్ద ఉసిరిని పెంచాలనుకునే వారికి ప్రధానంగా వచ్చే సందేహం.. విత్తనాల ద్వారా పెంచాలా లేక నర్సరీ నుంచి అంటు మొక్కను తెచ్చుకోవాలా? విత్తనాల నుంచి పెంచే మొక్కలు మొలకెత్తడానికి, చెట్టుగా ఎదిగి కాయలు కాయడానికి కనీసం 5 నుంచి 8 సంవత్సరాల సమయం పడుతుంది. అదే నర్సరీ నుంచి తెచ్చే అంటుకట్టిన హైబ్రిడ్ రకాలైతే ఒకటి రెండేళ్లలోనే కాయలు కాయడం మొదలవుతుంది. కాబట్టి బాల్కనీలు, టెర్రస్ గార్డెనింగ్‌కు గ్రాఫ్టెడ్ మొక్కలే అత్యుత్తమ ఎంపికని నిపుణులు సూచిస్తున్నారు.

విత్తనం నుంచి మొక్కను పెంచే విధానం

మీకు గార్డెనింగ్‌పై ఆసక్తి ఉండి విత్తనం నుంచే పెంచాలనుకుంటే.. బాగా పండిన నాణ్యమైన ఉసిరికాయ నుంచి గట్టిగా ఉండే గింజలను వేరు చేయాలి. ఉసిరి విత్తనానికి పెంకు గట్టిగా ఉంటుంది కాబట్టి మొలకెత్తే వేగాన్ని పెంచడానికి నాటడానికి ముందు 12 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత చిన్న కుండీ లేదా సీడ్లింగ్ ట్రేలో తోట మట్టి, వర్మీకంపోస్ట్, కొద్దిగా ఇసుక కలిపిన మిశ్రమంలో 1-2 సెం.మీ లోతులో విత్తనాన్ని నాటి నీరు చిలకరించాలి. మొక్క మొలకెత్తి 4-5 ఆకులు వచ్చిన తర్వాత పెద్ద కుండీలోకి మార్చుకోవాలి.

నర్సరీ మొక్క ఎంపిక – నాటే విధానం

నర్సరీ నుంచి మొక్కను ఎంచుకునేటప్పుడు దృఢమైన కాండం, తెగుళ్లు లేని తాజా ఆకులు ఉన్న గ్రాఫ్టెడ్ మొక్కను తీసుకోవాలి.

కుండీ సైజు: ఉసిరి వేర్లు లోతుగా విస్తరిస్తాయి కాబట్టి ప్రారంభంలోనే కనీసం 18 నుంచి 24 అంగుళాల లోతు, వెడల్పు ఉండి, అడుగున నీరు పోయేందుకు డ్రైనేజీ రంధ్రాలు ఉన్న పెద్ద కుండీ లేదా గ్రో బ్యాగ్‌ను ఎంచుకోవాలి.

పాటింగ్ మిక్స్ : 40 శాతం తోట మట్టి, 40 శాతం పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, 20 శాతం ఇసుక లేదా కోకోపీట్ కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేయాలి. నీరు నిల్వ ఉండకుండా సులభంగా ఇంకిపోయేలా మట్టి ఉండటం ముఖ్యం.

నాటేటప్పుడు జాగ్రత్త: మొక్కను ప్లాస్టిక్ కవర్ నుంచి వేర్లు దెబ్బతినకుండా తీసి కుండీ మధ్యలో ఉంచాలి. ముఖ్యంగా గ్రాఫ్టింగ్ చేసిన భాగం మట్టిలో పూడిపోకుండా ఉపరితలం పైనే ఉండేలా చూసుకోవాలి.

సంరక్షణ – ఎండ, నీటి యాజమాన్యం

ఉసిరి మొక్క ఎదుగుదలకు, పూత నిలవడానికి రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి తప్పనిసరి. కుండీలోని పైమట్టి ఎండినట్లు అనిపించినప్పుడు మాత్రమే తగినంత నీరు పోయాలి. అధిక నీరు చేరితే వేరు కుళ్లు తెగులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి 30 నుంచి 45 రోజులకు ఒకసారి గుప్పెడు వర్మీకంపోస్ట్ లేదా వేపపిండిని మట్టి పైపొరను కదిలించి వేస్తుంటే మొక్క ఏపుగా పెరిగి గుత్తులు గుత్తులుగా ఉసిరికాయలు కాస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us