Lip Balm: ఖరీదైన లిప్‌బామ్స్‌ వద్దు.. గులాబీ పువ్వులతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారడంతో పాటు పెదవులు కూడా పగులుతుంటాయి.వాటిని సంరక్షించుకునేందుకు జనాలు ఎక్కవగా వ్యాసిలేజ్, లేదా లిబ్బామ్ వాడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ లిప్‌బామ్స్ ఎక్కవ అయ్యాయి. కాబట్టి మీరు ఇంట్లోనే ఈజీగా లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

Lip Balm: ఖరీదైన లిప్‌బామ్స్‌ వద్దు.. గులాబీ పువ్వులతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
Homemade Lip Balm

Updated on: Nov 24, 2026 | 9:04 AM

చలికాలం రాగానే పెదాలు పగలడం, పొడిబారిపోవడం మొదలవుతుంది. అయితే, పెదాల కోసం లిప్ బామ్ వాడినా, అది ఎక్కువసేపు నిలవదు, మళ్లీ పెదాలు పగలడం ప్రారంభమవుతుంది. కానీ మీరు ఇంట్లో ఉండే కొన్ని సులభమైన వస్తువులతోనే సహజమైన లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. ఇది మీ పెదాలను మృదువుగా ఉంచడంతో పాటు, వాటి సహజమైన మెరుపును కూడా కాపాడుతుంది. కాబట్టి ఇంట్లోనే గులాబీ పువ్వుతో లిప్ బామ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం

లిప్ బామ్ తయారు చేయడం ఎలా

@RubykiRasoi అనే ఛానెల్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం.. లిప్ బామ్ తయారు చేయడానికి కొన్ని గులాబీ పువ్వు రేకులను తీసుకొని.. వాటి రేకులను తెంచి పక్కన పెట్టుకోవాలి. వాటిపై ఉన్న దుమ్ము, మురికి పూర్తిగా పోయేలా 2 నుండి 3 సార్లు శుభ్రమైన నీటితో శుభ్రపరచాలి. ఆ తర్వాత ఆ రేకులను ఒక శుభ్రమైన గుడ్డ లేదా రుమాలుపై పరచి ఆరబెట్టాలి.

లిప్ బామ్‌కు కావాల్సిన పదార్థాలు

  • ఒక గుప్పెడు గులాబీ రేకులు
  • అర చెంచా వ్యాసలిన్
  • 5 చెంచాల కొబ్బరి నూనె

లిప్ బామ్ తయారీ పద్దతి

ముందుగా కొన్ని గులాబీ రేకులను తీసుకొని వాటిని బాగా దంచుకోవాలి. రేకులు పేస్ట్‌లా మారిన తర్వాత, వాటిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకొని. ఇందులో అర చెంచా వ్యాసలిన్, 5 చెంచాల కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు వేడి చేసి, దాని పైన ఈ మిశ్రమం ఉన్న గిన్నెను పెట్టాలి. తక్కువ మంటపై 4 నుండి 5 నిమిషాల పాటు వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీ రేకుల రంగు, గుణాలు నూనెలో బాగా కలుస్తాయి.

బాగా వేడైన తర్వాత, జల్లెడ సహాయంతో వడకట్టాలి. తర్వాత చెంచా లేదా చేతులతో రేకులను నొక్కి రసం, సారం పూర్తిగా తీయాలి. దీన్ని ఒక చిన్న, శుభ్రమైన డబ్బాలో స్టోర్ చేసి. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద కొంతసేపు అలాగే ఉంచాలి. చల్లారిన తర్వాత ఇది లిప్ బామ్ రూపంలోకి మారుతుంది. అంతే మీకు కావాల్సిన లిప్ బామ్ రెడీ అయినట్టే. దీన్ని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us