Pressure coocked rice: నేటి ఆధునిక కాలంలో కుక్కర్లో వంట చేయడం చాలా మందికి సౌకర్యంగా, సమయాన్ని ఆదా చేసేదిగా మారింది. అయితే కుక్కర్లో వండుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుందా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మరి మీకూ అలాంటి సందేహం ఉందా..? మీ సందేహం తీరాలంటే పూర్తి కథనం చదవాల్సిందే..
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రెషర్ కుక్కర్లో వంట ప్రయోజనకరమేనట. ప్రెషర్‌తో ఉడకడంవల్ల అన్నం రుచిగా కూడా ఉంటుందట. కుక్కర్ పూర్తిగా మూసివేసి నీరు ఆవిరైపోకుండా ఉంటుంది. తద్వారా ఆహారంలో ఉండే పోషకాలు అందులోనే ఉంటాయి. కుక్కర్లో వండిన అన్నంలో పిండిపదార్థం తొలగిపోవడంవల్ల ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుందట. ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్ లాంటి నీటిలో కరిగే పోషకాలు ఉంటాయట. కుక్కర్లో అన్నంతో ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ప్రెషర్ కుక్కర్లో వండిన అన్న సులువుగా జీర్ణమవుతుంది. ఈ అన్నంలో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్ లాంటి స్థూల పోషకాలు ఉంటాయి. ఎక్కువ ప్రెషర్లో ఈ అన్నం వండటంవల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమైపోతాయి. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో వండే అన్నంలో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక వంట వేగంగా పూర్తవుతుంది. మంటపై ఎగిరినట్లుగా అన్నం ఎగరకపోవడంవల్ల మెతుకులు ఇరగకుండా ఉంటాయి.
అలాగే ప్రెషర్ కుక్కర్లో వండాలంటే నూనె అవసరం లేదు. ఆహారంలో నూనె కలపడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, నూనె లేకుండా తినడం కూడా శరీరానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇతర పాన్లలో, నాన్ స్టిక్ పాన్లలో వండటం కంటే కుక్కర్ లో వండటం మేలు అంటున్నారు. పొయ్యి మీద వంట చేయడం మంచి పద్దతి అయినప్పటికీ కుక్కర్లో పెట్టడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. అంతేకాదు..
కుక్కర్లో వంట చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. అలాగే, దీన్ని సులభంగా కడగవచ్చు. మీరు దానిలో వివిధ రకాల వంటకాలను వండుకోవచ్చు.
కుక్కర్లో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుక్కర్ విజిల్‌తో ప్రారంభించి, ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే, కుక్కర్ ఫుడ్స్ తినడం గురించి మీరు మీ పోషకాహార నిపుణుడిని కూడా సంప్రదించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..