Prevent Mosquito: దోమలు తెగ కుట్టేస్తున్నాయా? ఇలా చేస్తే మచ్చర్ మచ్చుకైనా కనిపించదు..

|

Jul 25, 2022 | 7:00 AM

Prevent Mosquito: వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో దోమలు కుట్టడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Prevent Mosquito: దోమలు తెగ కుట్టేస్తున్నాయా? ఇలా చేస్తే మచ్చర్ మచ్చుకైనా కనిపించదు..
Masquito
Follow us on

Prevent Mosquito: వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో దోమలు కుట్టడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఇంటి చుట్టూ నీరు చేరడం వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ దోమల వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా కారణంగా చాలా మంది చనిపోతున్నారు. ఈ కారణంగా డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ఉండటానికి దోమలను నివారించడం చాలా ముఖ్యం. అయితే, ఈ దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి సనాతన కాలం వుస్తున్న కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. వాటితో దోమలకు చెక్ పెట్టొ్చ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లిపాయ..
దోమలు మన జోలికి రాకుండా చేయడంలో ఉల్లిపాయల అద్భుత ఔషధంగా పని చేస్తుంది. ఉల్లిపాయలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీని రసం అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. దోమల బెడద నుంచి తప్పించుకోవాలనుకుంటే.. శరీరంపై ఉల్లిపాయ రసాన్ని రాయాలి. దీంతో దోమలు దరిదాపుల్లోకి కూడా రావు.

వెల్లుల్లి..
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది దోమలను మీ నుండి దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. 4 లేదా 5 వెల్లుల్లి రిబ్బలు తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ మినరల్ ఆయిల్ తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ నూనెను రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయాన్నే మరో గిన్నెలో వడకట్టాలి. ఈ నూనెలో నిమ్మరసం, రెండు కప్పుల నీరు పోసి బాగా మిక్స్ చేయాలి. స్ప్రే బాటిల్‌లో వేసి.. రాత్రి నిద్రపోయే ముందు, బయటికి వెళ్లే ముందు శరీరంపై చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల దోమలు కుట్టవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..