Chia Seeds: చియా సీడ్స్ వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..

చియా విత్తనాలు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. సూపర్ ఫుడ్ అని భావించి మీరు తినే ఈ విత్తనాలు, కొంతమంది ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చు. యా విత్తనాలు ఎవరికి హానికరం? వాటిని తినేటప్పుడు పాటించాల్సిన భద్రతా నియమాలు ఏమిటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Chia Seeds: చియా సీడ్స్ వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే రిస్క్..
Who Should Avoid Chia Seeds

Updated on: Feb 28, 2026 | 8:47 PM

వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి మనం వివిధ రకాల పానీయాలు, స్మూతీలలో చియా విత్తనాలను కలుపుకుని తాగుతుంటాం. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు చాలా మంచివి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే చియా విత్తనాలు కొంతమందికి మాత్రం ప్రాణసంకటంగా మారవచ్చు. చియా విత్తనాలు ఎవరికి హానికరం, వాటిని ఎలా తీసుకోవాలో నిపుణుల అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వీరు చియా విత్తనాలకు దూరంగా ఉండాలి:

రక్తాన్ని పల్చబరిచే మందులు వాడేవారు: మీరు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఆస్పిరిన్, వార్ఫరిన్ వంటి మందులను ఉపయోగిస్తుంటే, చియా విత్తనాలను అస్సలు తినకూడదు. చియాలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తాన్ని మరింత పల్చబరిచి అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు.

మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు:

చియా విత్తనాలలో పాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. ఇది కిడ్నీలపై అదనపు ఒత్తిడిని పెంచి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.

జీర్ణ సమస్యలు ఉన్నవారు:

ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, దీర్ఘకాలిక గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు వీటిని నివారించాలి. వీటిలోని అధిక ఫైబర్ కంటెంట్ ఈ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

అలెర్జీ ఉన్నవారు

కొంతమందికి గింజల వల్ల అలెర్జీ ఉంటుంది. చియా విత్తనాలు అరుదుగానైనా చర్మంపై దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా జీర్ణకోశ సమస్యలను కలిగిస్తాయి.

భద్రతా చిట్కాలు

ఆరోగ్యవంతులు కూడా చియా విత్తనాలను తినేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి:

ఎప్పుడూ నేరుగా తినకండి: చియా విత్తనాలను పొడిగా తినడం వల్ల అవి గొంతులో లేదా ఆహార పైపులో అతుక్కుపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది.

నానబెట్టి మాత్రమే తినండి: తినడానికి ముందు వాటిని కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు నీటిలో లేదా పాలలో నానబెట్టి, అవి జెల్ లాగా మారిన తర్వాతే తీసుకోవాలి.

Follow Us