
మారుతున్న మనిషి అలవాట్ల వలన కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోతున్నాడు. ఎందుకంటే, కొంత సమయం కూడా ఎండలో ఉండటం లేదు. ఏసీ గదుల్లోనే ఉండిపోతున్నారు. దీని వలన శరీరంలో విటమిన్ డి తగ్గిపోతుంది.

విటిమిన్ డి లోపించినప్పుడు నీరసం అయిపోతారు. ఇంకా చెప్పాలంటే ఎముకలు కూడా బలహీనపడి విరిగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బరువులు ఎత్తినప్పుడు కండరాలు నొప్పిగా ఉన్నాయా? అయితే, అది విటిమిన్ డి లోపమే.

విటమిన్ లోపించినప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గి జలుబు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. అంతేకాదు, మహిళలకు జుట్టు రాలుతున్నా విటమిన్ డి టెస్ట్ లు చేపించుకోవడం మంచిది.

వయస్సు పెరుగుతున్న కొద్దీ విటమిన్ డి తగ్గుతుంది. మెలనిన్ అధికంగా ఉన్న వాళ్ళకి చర్మం విటమిన్ డిని గ్రహించడానికి టైం తీసుకుంటుంది. కాబట్టి, ఈ సమస్యని ఈజీగా తీసుకోవద్దు.

కాబట్టి, మీరు తినే ఫుడ్ లో చేపలు, పుట్టగొడుగులు, పాలు చేర్చుకోవడం వలన ఈ సమస్య తగ్గుతుంది. విటమిన్ డి శరీరంలో తక్కువైతే ఇష్టమొచ్చినట్లు ముందులు తీసుకోకూడదు. దీనిని సహజంగా తీసుకుంటేనే మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)