
హై బీపీ ఉన్న వారు సమయానికి ఫుడ్ తీసుకోవాలి. అలా అని ఏవి పడితే అవి తీసుకోకూడదు. మీరు తినే వాటిలో ఈ ఫుడ్స్ ను దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కూల్ డ్రింక్స్: కూల్ డ్రింక్స్ , ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిని చాలా తగ్గించాలి. వీటిని అదే పని పనిగా తాగడం వలన వల్ల రక్తపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనల్లో తేలింది. కాబట్టి, ఇవి దూరంగా ఉండండి.

ఫాస్ట్ ఫుడ్స్ : ఆర్డర్ పెడితే త్వరగా వచ్చేస్తాయని పిజ్జా, బర్గర్ లాంటివి తింటూ ఉంటారు. కానీ, వాటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే, వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. ఇవి రక్తనాళాలను దెబ్బ తినేలా చేస్తాయి. దీని వలన రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా, ప్రాసెస్ చేసిన ఏ నాన్ వెజ్ ఐటెమ్ ను అయినా ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో సోడియం, నైట్రేట్ల వంటివి వాడుతారు. కాబట్టి, దీనిని తినడం వలన రక్తపోటు బాగా పెరుగుతుంది.

నిల్వ పచ్చళ్లు: ఒక రోజు పెట్టుకున్న పచ్చడి మూడు నాలుగు రోజుల తర్వాత తింటారు. నిల్వ ఉన్న పచ్చళ్ళు రుచిగా ఉంటాయని అనుకుంటారు. ఇవి తినడం దీని వలన రక్త పోటు పెరుగుతుంది. కాబట్టి, పచ్చళ్ళకు దూరంగా ఉండండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)