
వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, తక్షణ శక్తిని అందించడానికి ఎబిసి జ్యూస్ (ABC Juice – Apple, Beetroot, Carrot) ఒక అద్భుతమైన హెల్తీ డ్రింక్. ఈ మూడు సూపర్ ఫుడ్స్ కలయిక వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఎబిసి జ్యూస్‌ను మరింత రుచికరంగా, రిఫ్రెషింగ్‌గా ఎలా తయారుచేసుకోవాలో ఒక సరికొత్త రెసిపీని వివరించాము. ఈ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం సహజమైన కాంతితో మెరుస్తుంది, రక్తం శుద్ధి అవుతుంది. రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఎండ వేడిని తట్టుకోవడానికి ఈ సమ్మర్ స్పెషల్ హెల్తీ ట్రీట్‌ను ఎలా తయారు ఇప్పుడు చూద్దాం..
యాపిల్ – 1 (ముక్కలుగా తరిగినవి)
బీట్‌రూట్ – 1/2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
క్యారెట్ – 1 (ముక్కలుగా తరిగినవి)
అల్లం – చిన్న ముక్క
పుదీనా ఆకులు – 5-6
నిమ్మరసం – 1 స్పూన్
తేనె – 1 లేదా 2 స్పూన్లు (రుచికి సరిపడా)
చల్లని నీరు లేదా ఐస్ క్యూబ్స్ – తగినన్ని
తయారుచేసే విధానం (New Style Recipe): మొదట యాపిల్, క్యారెట్, బీట్‌రూట్‌లను శుభ్రంగా కడిగి, పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లేదా జ్యూసర్ తీసుకుని అందులో తరిగిన యాపిల్, క్యారెట్, బీట్‌రూట్ ముక్కలను వేయాలి. దాంతో పాటు చిన్న అల్లం ముక్క, కొన్ని తాజా పుదీనా ఆకులను జత చేయాలి. పుదీనా, అల్లం వేయడం వల్ల జ్యూస్‌కు మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్, జీర్ణశక్తి పెరుగుతుంది.
ఇందులో కొద్దిగా చల్లని నీరు పోసి, మిశ్రమాన్ని మెత్తగా (స్మూత్‌గా) బ్లెండ్ చేసుకోవాలి. మీకు పల్ప్ (పిప్పి) నచ్చకపోతే ఒక క్లాత్ లేదా స్ట్రైనర్ సాయంతో జ్యూస్‌ను వడకట్టుకోవచ్చు. అయితే, ఫైబర్ పూర్తిగా అందాలంటే వడకట్టకుండా తాగడం మరింత మంచిది. ఇప్పుడు ఈ జ్యూస్‌లో ఒక చెంచా నిమ్మరసం మరియు తీపి కోసం తేనె వేసి బాగా కలపాలి. ఎంతో టేస్టీగా, చల్లచల్లగా ఉండే న్యూ స్టైల్ ఎబిసి జ్యూస్ సిద్ధం! దీనిని సర్వింగ్ గ్లాస్‌లోకి తీసుకుని, ఐస్ క్యూబ్స్ మరియు పుదీనా ఆకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి.
ఎబిసి జ్యూస్ వల్ల కలిగే ప్రధాన లాభాలు: ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, మొటిమలను తగ్గించి, ఫేస్‌కు నాచురల్ గ్లో ఇస్తాయి. బీట్‌రూట్ రక్తాన్ని శుద్ధి చేయడంలో, లివర్ పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ వేసవిలో వచ్చే అలసటను దూరం చేసి, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..