శరీరాన్ని ఉక్కులా మారుస్తుంది.. మటన్‌లోని ఈ పార్ట్‌ను 10 రోజులకు ఒక్కసారైనా తినండి..

మేక తలకాయ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు.. మేక తలకాయ కూర ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్, ఫాస్ఫరస్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. రక్తహీనతను నివారిస్తుంది.. కీళ్ల నొప్పులను తగ్గించి.. ఎముకలు, గుండె, చర్మం, కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శరీరాన్ని ఉక్కులా మారుస్తుంది.. మటన్‌లోని ఈ పార్ట్‌ను 10 రోజులకు ఒక్కసారైనా తినండి..
Goat Head Curry Benefits

Updated on: Oct 28, 2026 | 1:21 PM

మాంసాహార ప్రియులు మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. మేక మాంసంతోపాటు.. పలు భాగాలు కూడా అద్భుతమైన ప్రయోజనాలను కలిగిఉన్నాయి. మటన్ తిల్లి, లివర్, కాళ్లు, తలకాయ, బోటి ఇలా అన్నీంటిలో కూడా ఎక్కువ పోషకాలు దాగున్నాయి.. అయితే.. చాలా మంది మటన్ తలకాయ కూరను బాగా ఇష్టపడతారు.. వాస్తవానికి మేక తలకాయ కూరలో మీరు ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా నీరసం పోయి.. బలం రావడానికి పెద్దలు మేక తలకాయ కూరను తినాలని సూచిస్తుంటారు.. 10 రోజులకు ఒక్కసారైనా మేక తలకాయ కూరను తినాలని సూచిస్తుంటారు.. మేక తలకాయ కూర తినడం వల్ల కలిగే లాభాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

మేక తలకాయ కూరలో ఎన్నో పోషకాలు..

మేక తలకాయ కూరలో ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా కొంత మొత్తంలో ఉంటాయి.. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి..

ఈ కూరలోని విటమిన్ బి12 రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే, ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనతను నివారించడంలో మేక తలకాయ కూర సమర్థవంతంగా సహాయపడుతుంది.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఉపశమనం అందిస్తుంది, ఎందుకంటే ఇందులో గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్ ఉంటాయి. కాల్షియం – ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని స్థితిస్థాపకంగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మేక తలకాయ కూరలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రాత్రిపూట దృష్టిని పెంచడంలో ముఖ్యమైనది. మేక తలకాయ కూరను తినడం ద్వారా ఈ అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు.

అయితే.. సాధారణంగా మటన్ కూరలానే.. మేక తలకాయ కూరను అద్భుతంగా వండుకోవచ్చు.. తలకాయ కర్రీ.. ఫ్రై టైప్ వండుకుని తింటుంటే ఆ మజానే వేరు.. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు కలిగిన మేక తలకాయ కర్రీని మీరు కూడా తినండి.. మేక తలకాయ కూరను పరిమితంగా తీసుకోవడం మంచిది.

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us