Sweetcorn Pakodi: వెరైటీగా, ఈజీగా బెస్ట్ స్నాక్.. స్వీట్ కార్న్ పకోడీ..

పిల్లలకు బాగా ఇష్టమైన చిరు తిళ్లలో స్వీట్ కార్న్ కూడా ఒకటి. ఎన్ని సార్లు ఇచ్చినా పిల్లలు ఆలోచించకుండా స్వీట్ కార్న్ తింటారు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అందుకే పిల్లలకు బాగా ఇష్ట పడి తింటూ ఉంటారు. స్వీట్ కార్న్ చాట్ కూడా మీరు తినే ఉంటారు. స్వీట్ కార్న్ అంటే కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం. ఇందులో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు లభ్యమవుతాయి. ఇది ఎన్ని సార్లు తిన్నా.. ఆరోగ్యానికి చాలా మంచిదే. స్వీట్‌ కార్న్‌తో చేసుకోదగిన..

Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 03, 2024 | 9:45 PM

పిల్లలకు బాగా ఇష్టమైన చిరు తిళ్లలో స్వీట్ కార్న్ కూడా ఒకటి. ఎన్ని సార్లు ఇచ్చినా పిల్లలు ఆలోచించకుండా స్వీట్ కార్న్ తింటారు. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అందుకే పిల్లలకు బాగా ఇష్ట పడి తింటూ ఉంటారు. స్వీట్ కార్న్ చాట్ కూడా మీరు తినే ఉంటారు. స్వీట్ కార్న్ అంటే కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం. ఇందులో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు లభ్యమవుతాయి. ఇది ఎన్ని సార్లు తిన్నా.. ఆరోగ్యానికి చాలా మంచిదే. స్వీట్‌ కార్న్‌తో చేసుకోదగిన రెసిపీల్లో పకోడీ కూడా ఒకటి. ఇంట్లో స్వీట్ కార్న్ ఉండాలే కానీ.. కేవలం పదే నిమిషాల్లో ఈ రెసిపీ సిద్ధం అవుతుంది. పిల్లలకు కూడా వెరైటీగా చేసి పెట్టినట్టు ఉంటుంది. మరి ఈ టేస్టీ స్వీట్ కార్న్ పకోడీని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ పకోడీకి కావాల్సిన పదార్థాలు:

స్వీట్ కార్న్, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, అల్లం తరుగు, జీలకర్ర, కార్న్ ఫ్లోర్, శనగ పిండి, పసుపు, కారం, ఆయిల్.

స్వీట్ కార్న్ పకోడీ తయారీ విధానం:

ముందుగా ఒక పాత్రలోకి స్వీట్ కార్న్ గింజల్ని తీసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తి మీర, ఉప్పు, అల్లం తరుగు, జీలకర్ర, కార్న్ ఫ్లోర్, శనగ పిండి, పసుపు, కారం, కొద్దిగా నీళ్లు వేసి తడీ పొడీగా కలపండి. అవసరం అనుకుంటే కొదిగ్గా వాటర్ వేసి కలుపుకోవచ్చు. కావాలి అనుకుంటే.. కొద్దిగా బేకింగ్ సోడా కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక.. కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని పకోడీలుగా వేసుకోవాలి. మీడియం మంట మీద.. ఎర్రగా వేయించుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ పకోడా సిద్ధం. వీటిని టమాటా సాస్ లేదా పుదీనా చట్నీతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి.

రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..