గ్లామర్ డోస్ నే కాదు ట్రెడిషనల్ గా కూడా క్యూట్ గా కవ్విస్తున్న అనన్య

Anil Kumar

03 August 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగమ్మాయి తన ప్రతిభతో అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రశంసలు అందుకుంది.

కానీ హీరోయిన్ ఆఫర్స్ కోసమే వెయిట్ చేయకుండా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అనన్య.

ఈ మధ్య అన్ని హారర్ మరియు క్రైమ్ నేపథ్యంలో సినిమాలు చేస్తున్న అనన్య నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.

ఓ వైపు వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అనన్య.. అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం ఏదోక ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ  ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ క్యూట్ హీరోయిన్ అనన్య.

ఇటీవల కొన్నాళ్లుగా గ్లామర్ ఫిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. ఈమె గ్లామర్ ఫొటోస్ వైరల్ అవుతుంటాయి.

తాజాగా సోషల్ మీడియాలో అనన్య షేర్ చేసిన ఫొటోస్ తెగ వైరలవుతున్నాయి. ఆ ఫొటోస్ యూత్ ని ఆకట్టుకుంటున్నాయి.