Chiyaan Vikram – Adani: కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 180 మందికి పైగా మృతిచెందిన ఘటన దేశాన్ని కలిచి వేస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు అదానీ గ్రూప్‌ అండగా నిలబడుతుందని అన్నారు.

Chiyaan Vikram - Adani: కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!

|

Updated on: Aug 03, 2024 | 6:03 PM

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 180 మందికి పైగా మృతిచెందిన ఘటన దేశాన్ని కలిచి వేస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు అదానీ గ్రూప్‌ అండగా నిలబడుతుందని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు.

అదానీ గ్రూప్‌తో పాటు, RP గ్రూప్‌ రవి పిళ్లై, లూలు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ, కల్యాణ్‌ జువెలర్స్‌ ఛైర్మన్‌ ఎండీ టి.ఎస్‌.కల్యాణరామన్‌లు కూడా ఒక్కొక్కరూ రూ.5 కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. వయనాడ్‌ ఘటనపై నటుడు విక్రమ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్‌ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్ర బృందాలు ప్రకటించాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us