Honey Chilli Cauliflower: హనీ చిల్లీ కాలీఫ్లవర్.. తిన్న వాళ్లు మళ్లీ కావాలంటారు..

మనం నిత్యం ఉపయోగించే కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. ఆరోగ్యానికి కాలీఫ్లవర్ చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాలీఫ్లవర్‌ తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే కాలీఫ్లవర్‌ని సరిగ్గా క్లీన్ చేయాలి. సరిగా క్లీన్ చేయకపోతే లాభాలకు బదులు నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి వీటిని సరిగ్గా క్లీన్ చేయాలి. కాలీఫ్లవర్‌తో ఎక్కువగా చాలా మంది మంచూరియా తయారు..

Honey Chilli Cauliflower: హనీ చిల్లీ కాలీఫ్లవర్.. తిన్న వాళ్లు మళ్లీ కావాలంటారు..
Honey Chilli Cauliflower
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 03, 2024 | 9:00 PM

మనం నిత్యం ఉపయోగించే కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. ఆరోగ్యానికి కాలీఫ్లవర్ చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాలీఫ్లవర్‌ తినడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే కాలీఫ్లవర్‌ని సరిగ్గా క్లీన్ చేయాలి. సరిగా క్లీన్ చేయకపోతే లాభాలకు బదులు నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి వీటిని సరిగ్గా క్లీన్ చేయాలి. కాలీఫ్లవర్‌తో ఎక్కువగా చాలా మంది మంచూరియా తయారు చేసి ఉంటారు. కానీ ఒక్కసారి ఇలా హనీ చిల్లీ కాలీఫ్లవర్ తయారు చేయండి. మీ ఇంట్లో వాళ్లు మీకు ఫ్యాన్ అయిపోతారు. మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ చేయమని అంటారు. ఈ రెసిపీ తయారు చేయడం కూడా సింపులే. ఎక్కువ సమయం కూడా పట్టదు. సాయంత్రం పూట స్నాక్‌లా ఈ ఐటెమ్ తినొచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.

హనీ చిల్లీ కాలీఫ్లవర్‌కి కావాల్సిన పదార్థాలు:

కాలీఫ్లవర్, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చి మిర్చి, తేనె, వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్, నువ్వులు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, ఆయిల్.

హనీ చిల్లీ కాలీఫ్లవర్‌ తయారీ విధానం:

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్‌ ముక్కలు, ఉప్పు, బేకింగ్ సోడా కొద్దిగా, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలి. ఈ ఆయిల్ వేడెక్కాక.. కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ ముక్కల్ని వేయాలి. ఇవి గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేశాక.. సన్నగా కట్ చేసి వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇవి వేగాక సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్, వెనిగర్, తేనె వేసి బాగా కలపాలి. ఇందులోనే ఓ పెద్ద స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ సాసులు మాడక ముందే కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఓ రెండు నిమిషాలు వేయించాక ఉల్లి కాడలు, కొద్దిగా నువ్వులు పైన వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే హనీ చిల్లీ కాలీఫ్లవర్‌. రుచి చాలా బాగుంటుంది. ఇందులో హనీ ఉంటుంది కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతుంది.

ఆంధ్రా స్టైల్‌లో ఇలా చిల్లీ చికెన్ కర్రీ చేయండి.. అదుర్స్ అంతే!
ఆంధ్రా స్టైల్‌లో ఇలా చిల్లీ చికెన్ కర్రీ చేయండి.. అదుర్స్ అంతే!
హనీ చిల్లీ కాలీఫ్లవర్.. తిన్న వాళ్లు మళ్లీ కావాలంటారు..
హనీ చిల్లీ కాలీఫ్లవర్.. తిన్న వాళ్లు మళ్లీ కావాలంటారు..
నరాలు తెగే ఉత్కంఠ.. సీన్‌ సీన్‌కు సుస్సుపోయాల్సిందే..
నరాలు తెగే ఉత్కంఠ.. సీన్‌ సీన్‌కు సుస్సుపోయాల్సిందే..
వేడి వేడి పొటాటో బాల్స్.. ఇలా చేస్తే అస్సలు వదిలి పెట్టరు..
వేడి వేడి పొటాటో బాల్స్.. ఇలా చేస్తే అస్సలు వదిలి పెట్టరు..
'మాస్' మూవీ స్టైలిష్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెంటిలా మారిపోయాడు
'మాస్' మూవీ స్టైలిష్ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెంటిలా మారిపోయాడు
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పుడో తెలుసా..?
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎప్పుడో తెలుసా..?
మీ ఫోన్ నంబర్ హైజాక్ చేస్తున్నారు జాగ్రత్త.. ఓటీపీ రాకుండానే..
మీ ఫోన్ నంబర్ హైజాక్ చేస్తున్నారు జాగ్రత్త.. ఓటీపీ రాకుండానే..
ఎవరీ శ్రీకాంత్.. కుప్పంలో ఎందుకంత ప్రియారిటీ..!
ఎవరీ శ్రీకాంత్.. కుప్పంలో ఎందుకంత ప్రియారిటీ..!
పిల్లలు ఇష్టపడీ మరి లాగించే స్నాక్.. 'బ్రెడ్ మసాలా'
పిల్లలు ఇష్టపడీ మరి లాగించే స్నాక్.. 'బ్రెడ్ మసాలా'
డ్రై ఫ్రూట్స్‌ను దేనిలో నానబెట్టి తినాలి? నీటిలోనా.. పాలలోనా..?
డ్రై ఫ్రూట్స్‌ను దేనిలో నానబెట్టి తినాలి? నీటిలోనా.. పాలలోనా..?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..