
చింత చిగురుతో మనం ఎన్నో కూరలను చేసుకుంటాము. కానీ, అన్నింటిలో అదిరిపోయే కాంబినేషన్ ఏదయినా ఉందంటే అది చింత చిగురుతో మటన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాంబో వింటుంటేనే నోరూరిపోతుటుంది. అంత రుచి కరంగా ఉంటుంది.

ఏంటి, మీకు కొత్తగా ఉందా? కానీ, చేసుకుని తింటే అదిరిపోతుంది. మటన్ దొరుకుతుంది, కానీ, చింత చిగురు ఎలా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నారా? మన ఇళ్ళ పక్కన చింత చెట్లకి కొంచమైనా దొరుకుతుంది. అదే తెచ్చి వండేయండి.

కావాల్సిన పదార్ధాలు: పావు కేజీ చింత చిగురు, అర కేజీ మటన్, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, మీడియం ఉల్లిపాయ, గసగసాలు, జీలకర్ర, పసుపు, కారం, నూనె, రుచికి తగినంత ఉప్పు, ఒక కట్ట కొత్తిమీర

ముందుగా పాన్ తీసుకుని నూనె వేసి, కొద్దీ సేపటి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా తిప్పాలి. ఇప్పుడు పసుపు , అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే, స్టవ్ మీదే 10 నిముషాలు ఉంచాలి.

ఇప్పుడు మటన్ తీసుకుని బాగా కడిగి కుక్కర్లో ఉడికించి కారం వేసి బాగా తిప్పుకోవాలి. ఇలా చేస్తే మటన్ ముక్కలకి కారం పట్టి తినడానికి రుచి కరంగా ఉంటుంది. ఇక ఇప్పుడు చింత చిగురు వేసి, కొద్దీ సేపటి తర్వాత మసాలా పొడులు వేసి కలిసేపోయే స్టవ్ మీదే ఉంచాలి. 10 నిముషాల తర్వాత కిందకి దించేయండి. అంతే, చింత చిగురు మటన్ రెడీ. దీనిని వేడి వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది