Atukula Laddu: బూందీ లడ్డూకి తీసిపోని టేస్ట్ దీని సొంతం.. ఈజీగా టేస్టీగా అటుకుల లడ్డూ తయారీ విధానం

Atukula Laddu: వరి ధాన్యాన్ని నానబెట్టి తయారు చేసే ఒక ఆహార పదార్ధం అటుకులు.. వీటిని పూర్వకాలంలో ధాన్యాన్ని దంచి తయారు చేసేవారు.. కానీ ఇప్పుడు యంత్ర సహాయంతో తయారు చేస్తున్నారు. ఈ అటుకులను..

Atukula Laddu: బూందీ లడ్డూకి తీసిపోని టేస్ట్ దీని సొంతం.. ఈజీగా టేస్టీగా అటుకుల లడ్డూ తయారీ విధానం
Atukula Laddu

Updated on: Jul 07, 2021 | 3:56 PM

Atukula Laddu: వరి ధాన్యాన్ని నానబెట్టి తయారు చేసే ఒక ఆహార పదార్ధం అటుకులు.. వీటిని పూర్వకాలంలో ధాన్యాన్ని దంచి తయారు చేసేవారు.. కానీ ఇప్పుడు యంత్ర సహాయంతో తయారు చేస్తున్నారు. ఈ అటుకులను హిందువుల పండుగల్లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. కుచేలుడు తన ప్రాణస్నేహితుడైన శ్రీకృషుడికి అటుకులను సమర్పించి ఆగర్భ శ్రీమంతుడయ్యాడని పురాణాల కథనం అంతటి విశిష్టత కలిగిన ఈ అటుకులతో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. పోహా లేదా అటుకుల ఉప్మా, అటుకుల పులిహోర లే కాదు.. అటుకుల తో లడ్డు స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు.. బూందీ లడ్డూ కి ఏ మాత్రం తగ్గని టెస్ట్ దీని సొంతం.. ఈరోజు అటుకుల లడ్డూ తయారీ విధానం తెలుసుకుందాం

అటుకుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు:

అటుకులు – రెండు కప్పులు
పంచదార – ఒకటిన్నర కప్పు
నెయ్యి ఒక కప్పు
యాలకుల పొడి 1 స్పూన్
జీడిపప్పు,
కిస్మిస్

తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి.. దానిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేడి ఎక్కిన తర్వాత అటుకులు వేసి.. అటుకులను వేయించుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసి.. జీడిపప్పు ను, కిస్మిస్ ను వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో అటుకులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ మిక్సీ గిన్నెలో పంచదార, యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అటుకుల పొడి పంచదార యాలకుల మిశ్రమం, జీడిపప్పు కిస్మిస్ కలిపి కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూల మాదిరిగా ఉండలుగా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన అటుకుల లడ్డూలు తయారీ అయ్యాయి.

Also Read: Home Made Health Tips: రక్తహీనత, రక్త పోటుతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలను పాటించి.. ఉపశమనం పొందండి

Loading...
Unable to load recommendations.
Follow Us