Hair Care Tips: బట్టతల వస్తుందని భయపడుతున్నారా..? ఇలా చేస్తే వృద్ధాప్యం వరకు జుట్టు రాలదు..

|

Dec 15, 2021 | 9:53 PM

Healthy Hair Care Tips: మారుతున్న కాలంతోపాటు హార్మోన్ల సమస్యల కారణంగా జుట్టు రాలడం కొనసాగుతూనే ఉంటుంది. దీంతోపాటు ఒత్తిడి, మానసిక సమస్యలు, పోషకాల లోపం కూడా జుట్టు రాలడంపై

Hair Care Tips: బట్టతల వస్తుందని భయపడుతున్నారా..? ఇలా చేస్తే వృద్ధాప్యం వరకు జుట్టు రాలదు..
Healthy Hair Care Tips
Follow us on

Healthy Hair Care Tips: మారుతున్న కాలంతోపాటు హార్మోన్ల సమస్యల కారణంగా జుట్టు రాలడం కొనసాగుతూనే ఉంటుంది. దీంతోపాటు ఒత్తిడి, మానసిక సమస్యలు, పోషకాల లోపం కూడా జుట్టు రాలడంపై ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి పది మందిలో ఏడుగురు ఉంటున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. జుట్టు రాలే సమస్యకు చెక్‌ పెట్టకపోతే.. మొహం అందం పోతుంది. ఇది చూడటానికి సాధారణ సమస్యే అయినప్పటికీ.. చికిత్స చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సకాలంలో చికిత్స అందించపోతే.. క్రమంగా బట్టతలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే.. చాలా మందికి వృద్ధాప్యానికి ముందే బట్టతల వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

అయితే.. జట్టు రాలే సమస్యకు పరిష్కారం కోసం మార్కెట్లల్లో లభించే పలు రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. దీంతోపాటు వివిధ పద్ధతులను పాటిస్తారు. అయినా కానీ సరైన ఫలితం కనిపించకపోతే.. ఈ పద్దతులు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ చిట్కాలు పాటిస్తే.. జట్టు రాలే సమస్యకు పుల్‌స్టాప్‌ పెట్టొచ్చని పేర్కొంటున్నారు. వంటగదిలో లభించే.. ఐదు రకాల పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకుంటే.. జట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బచ్చలికూర..
ఐరన్ పుష్కలంగా ఉండే బచ్చలికూరలో అనేక రకాల పోషకాలు విటమిన్లు ఉన్నాయి. దీనిని రెగ్యులర్‌గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. బచ్చలికూర ప్రత్యేకత ఏమిటంటే ఇది ఎర్ర రక్త కణాలను సృష్టించడంతోపాటు శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. మీరు దీన్ని కూరగాయలు లేదా సలాడ్‌ రూపంలో తీసుకోవచ్చు.

కరివేపాకు
కరివేపాకును ఆహారంలో చేర్చడమే కాకుండా తలకు నూనె రూపంలో కూడా రాసుకోవచ్చు. రోజూ వాడే నూనెలో కరివేపాకు రసాన్ని కలిపి జుట్టుకు పట్టిస్తే.. జట్టు రాలడం తగ్గుతుంది.

ఉల్లిపాయ రసం
జుట్టు సంరక్షణలో ఉల్లిపాయ రసం చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఉల్లిపాయను పేస్ట్ లా చేసి, దాని రసాన్ని కాటన్ క్లాత్ సహాయంతో తీసి తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని జుట్టుకు పట్టించి రెండు మూడు గంటలపాటు అలాగే ఉంచి సాధారణ నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు రాలడం కూడా తగ్గుతుంది.

గ్రీన్ టీ
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా ఉత్తమమైనది. విశేషమేమిటంటే ఇది శరీరానికి కూడా ఆరోగ్యకరం. దీన్ని మీ దినచర్యలో భాగం చేసుకుంటే.. జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.

ఉసిరికాయ
ఉసిరికాయ జుట్టు సంరక్షణలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మురబ్బా రూపంలో కూడా ఉసిరికాయను తినవచ్చు. తినడమే కాకుండా ఉసిరి పెస్ట్‌ను తయారు చేసి జుట్టుకు రాసుకుంటే.. చుండ్రుతోపాటు.. జట్టు రాలడం తగ్గుతుంది.

Also Read:

Flaxseed Gel: అవిసెగింజలతో జట్టు సమస్యలకు చెక్.. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఉపయోగాలు తెలిస్తే షాకే..

Banana Benefits: చలికాలంలో అరటిపండు తింటున్నారా.. అయితే ఈ సంగతి తప్పనిసరిగా తెలుసుకోండి..