Mutton : మటన్ విషయంలో ఇక డోంట్ వర్రీ.. ఫ్రెష్ మీట్ ఎట్ యువర్ డోర్ స్టెప్.! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రయోగం..!

Fresh mutton meat at your doorstep!: మటన్ కొనడం పేద, మధ్యతరగతి ప్రజలకు ఒక పరీక్ష. కళ్లు మూసి తెరిచే లోగా గారడీ చేసేస్తుంటారు కొందరు అమ్మకందారులు...

Mutton : మటన్ విషయంలో ఇక డోంట్ వర్రీ.. ఫ్రెష్ మీట్ ఎట్ యువర్ డోర్ స్టెప్.! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రయోగం..!
Mutton Shops

Updated on: May 23, 2021 | 8:52 AM

Fresh mutton meat at your doorstep!: మటన్ కొనడం పేద, మధ్యతరగతి ప్రజలకు ఒక పరీక్ష. కళ్లు మూసి తెరిచే లోగా గారడీ చేసేస్తుంటారు కొందరు అమ్మకందారులు. ఒక పక్క అధిక ధర, ఇంకోపక్క.. తీరా అంతసొమ్ములు పెట్టినా మనసుకు నచ్చిన మేక, గొర్రె మాంసం చేతికందక పోవడం.. వెరసి సామాన్య జనం మటన్ కొట్టు వైపు చూస్తూ వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం దాపురించాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా, ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణలో ఒక వినూత్న ప్రయోగం చేయబోతున్నారు. దీంతో ఇండ్లలో వండుకోడానికి, వివాహాది శుభకార్యాలకు.. ఇకపై మాంసం గురించి, దాని నాణ్యత గురించి చింతించవలసిన పని ఉండదు. ప్రభుత్వమే అతి త్వరలో మీఇంటి వద్దకు వాహనంలో మేకలు లేదా గొర్రెలను పంపి, అక్కడే వధించి నాణ్యమైన మాంసం సరఫరా చేయబోతోంది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ పశు సంవర్ధకశాఖ కసరత్తు చేస్తుండగా, దీనిపై హైదరాబాద్‌లోని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం(ఎన్‌ఆర్‌సీఎం) పరిశోధనలు చేస్తోంది.

ఇక, మొబైల్‌ షీప్‌ స్లాటర్స్‌ విధానం అమల్లోకి వస్తే దేశంలోనే తొలిసారిగా ప్రయోగం చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతుంది. ఇప్పటికే వాహనం నమూనా సిద్ధంకాగా, త్వరలోనే ఈ ప్రయోగాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రస్తుతానికి ఈ మొబైల్‌ షీప్‌ స్లాటర్స్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

Read also : Maha Visakhapatnam : సాగర నగర వాసులకు ముఖ్య గమనిక : (ఆదివారం) నో నాన్-వెజ్ బిజినెస్.!