రోగ నిరోదక శక్తికి పసుపు ఎంతో ముఖ్యం… రోజూ ఈ డ్రింక్ తాగితే కరోనా దూరం.. సూచిస్తున్న నిపుణులు..

|

Apr 19, 2021 | 12:35 PM

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నా.. మరొపక్క కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ మహామ్మారి భారిన పడి

రోగ నిరోదక శక్తికి పసుపు ఎంతో ముఖ్యం... రోజూ ఈ డ్రింక్ తాగితే కరోనా దూరం.. సూచిస్తున్న నిపుణులు..
Boosting Drink
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నా.. మరొపక్క కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ మహామ్మారి భారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కొల్పోతున్నారు. రోజులో 2 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవతుండం కొంత ఆందోళనకు గురిచేస్తుంది. ఈ మహమ్మారి నుంచి తామను తాము కాపాడుకోవడానికి సామాజిక దూరం పాటించడం.. మాస్కులు ధరించడం.. వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లను పాటించడమే సరైన మార్గం. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపోందించుకోవాలి. అందుకు తగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి.

ఇక మన భారతీయ వంటశాలలో ఉండే ఆహార పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ముఖ్యంగా పసుపు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను పసుపు మిశ్రమం తగ్గిస్తుందని.. ప్రముక ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా , మాజీ మోడల్ మిలింద్ సోమన్ తెలిపారు.

ఎలా తయారు చేయాలి.

కావల్సిన పదార్థాలు..
నీరు – 2 లీటర్లు..
పసుపు- ఒక ముక్క
నల్ల మిరియాల పొడి – 1 టేబుల్ స్పూన్
తులసి – 15- 20 ఆకులు
లవంగాలు 8-10
అల్లం 2 అంగుళాల పొడవు
దాల్చిన చెక్క – ఒక ముక్క
నిమ్మకాయ – ఒకటి

ఒక లోతైన బాణాలిలో నీరు పోసి మీడియం గ్యాస్ మీద వేడి చేయాలి. దానిలో పైన తెలిపిన పదార్థాలను ఒక్కోక్కటిగా వేసి, లీటర్ తగ్గే వరకు 10-20 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత దీనిని వడకట్టి ఒక సీసాలో నిల్వ చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి.

గమనిక: ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించండి.

Also Read: Keerthi Suresh: జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‏గా కీర్తిసురేష్.. చీరకట్టులో ‘మహానటి’ బ్యూటీఫుల్ పిక్స్..

ఫేషియల్ కోసం వెళ్ళిన హీరోయిన్.. మరింత అందంగా మారుస్తానని చెప్పిన డాక్టర్.. చివరికి ఇలా.