Ayurveda Laddu-Home Made Health Tip: ఏ చిన్న పని చేసినా అలసటగా అనిపించడం, కొంచెం దూరం నడవగానే ఆయాసం, నీరసం రావడం ఇవన్నీ శరీరంలో తగినంత రక్తం లేకపోతే జరుగుతుంటాయి. బాడీకి కావలసిన ఐరన్ సమపాళ్లలో లేనప్పుడు రక్తహీనత సంభవిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. అన్నిటికీ టాబ్లెట్లు వాడే బదులు ఇంట్లోనే ఐరన్ సంబంధిత పదార్థాల ద్వారా బ్లడ్ లెవల్స్ పెంచుకునే విధానం ఆయుర్వేదంలో సహజ పద్ధతుల్లో చెప్పబడింది. రక్తహీనతను తగ్గించి.. రోగనిరోధక శక్తిని పెంచే వాల్ నట్స్, తెల్ల నువ్వులు బెల్లం తో చేసిన లడ్డు తయారీ తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు:
వాల్ నట్స్ – ఒక కప్పు
తెల్ల నువ్వులు -ఒక కప్పు
బెల్లం – తీపికి సరిపడా (ఒక కప్పు తురుము )
ఆవు నెయ్యి – లడ్డు చుట్టడానికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా స్టౌ వెలిగించి బాణలి పెట్టి… ఒక కప్పు నువ్వులు దోరగా వేయించుకుని .. చల్లారనివ్వాలి.. అనంతరం ఆ నువ్వులను మిక్సీ లో వేసుకునిగ్రైండ్ చేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత కప్పు వాల్ నట్స్ కూడా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నువ్వుల పొడిని, వాల్ నట్స్ పొడిని వేసుకుని తగినంత బెల్లం తురుముని తీసుకుని మూడింటిని మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం ఆవునెయ్యి జోడించి లడ్డూలు కట్టాలి. వీటిని రోజుకొకటి తింటూ ఉంటే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. ఈ లడ్డూ రక్త హీనత సమస్యను తగ్గించడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. చిన్నారుల పెరుగుదలకు ఈ లడ్డు మంచి ఆహారం.
ఆరోగ్య ప్రయోజనాలు:
వాల్ నట్స్‌లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. తెల్ల నువ్వుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇక బెల్లం ఇందులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆవు నెయ్యి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కనుక అనారోగ్యానికి గురైన ప్రతిసారీ వైద్యుని దగ్గరకు వెళ్లడం కంటే.. చక్కటి ఆరోగ్యకరమైన ఆరోగ్యం తీసుకోవడం.. చిన్న చిన్న చిట్కాలతో వైద్యం చేసుకుని ఉపశమనం పొందవచ్చు.
Also Read: Miracle Plant: మన ఇంటి సంజీవని.. ఈ మొక్క ఇంట్లో ఉంటే డాకర్ మీదగ్గర ఉన్నట్లే.. ఈ ఆకుతో పైల్స్‌కు శాశ్వతంగా చెక్