ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. నిమిషాల్లో ఇలా తయారు చేయండి!

రాత్రిపూట చేసుకున్న చపాతీలు మిగిలిపోతే వాటిని ఏం చేయాలో తెలియక చాలామంది పారేస్తుంటారు. లేదా వేడి చేసుకుని తింటుంటారు. కానీ, ఆ మిగిలిన చపాతీలతోనే కేవలం కొన్ని నిమిషాల్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన, ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేయవచ్చు. ఆహారం వృథా కాకుండా చూడటంతో పాటు, ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవారికి తక్షణ శక్తినిచ్చే ఈ ప్రత్యేకమైన పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది ఇది. అలాంటి టిఫిన్ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. నిమిషాల్లో ఇలా తయారు చేయండి!
Leftover Chapati Recipe

Updated on: Aug 07, 2026 | 12:24 PM

చాలా మంది రాత్రి మిగిలిపోయిన రోటీలను పారేస్తుంటారు. కానీ, రాత్రి మిగిలిపోయిన చపాతీలను పారవేయకుండా, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన, పోషకాలతో కూడిన టిఫిన్‌గా మార్చవచ్చు. ఇది ఆహారం వృథా కాకుండా చూడటమే కాక, రోజంతా ఉత్సాహాన్నిచ్చే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మీ ఇంట్లో మిగిలిపోయిన రోటీలు ఉంటే, ఈ సులభమైన వంటకాన్ని ఒకసారి ప్రయత్నించండి.

కావాల్సిన పదార్థాలు:

మిగిలిపోయిన చపాతీలు – 2 లేదా 3

నూనె లేదా నెయ్యి – 2 చెంచాలు

జీలకర్ర – 1/2 చెంచా

ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

పచ్చిమిర్చి – 1 లేదా 2

క్యాప్సికమ్, క్యారెట్, బఠానీ, బీన్స్ – తగినంత (తరిగినవి)

పసుపు – 1/2 చెంచా

కారం – 1/2 చెంచా

చాట్ మసాలా – 1/2 చెంచా

ఉప్పు – రుచికి సరిపడా

కొత్తిమీర, నిమ్మరసం – తగినంత

తురిమిన పనీర్ లేదా చీజ్ – (ఆప్షనల్)

తయారీ విధానం:

ముందుగా మిగిలిపోయిన చపాతీలను చేతితో చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి లేదా మిక్సీలో ఒక్క రౌండ్ వేసి కచ్చాపచ్చాగా పొడిలా చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి నూనె లేదా నెయ్యి వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, మీకు నచ్చిన కూరగాయలు క్యారెట్, బఠానీ, బీన్స్ వేసి 2-3 నిమిషాలు దోరగా వేయించాలి. కూరగాయలు కాస్త వేగాక పసుపు, కారం, ఉప్పు, చాట్ మసాలా కావాలంటే కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

ఇప్పుడు తుంచుకున్న చపాతీ ముక్కలను ప్యాన్‌లో వేసి, మసాలాలన్నీ చపాతీలకు పట్టేలా బాగా కలపాలి. సన్నని మంటపై 3 నుండి 4 నిమిషాల పాటు మూతపెట్టి మగ్గనివ్వాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం చల్లాలి. పిల్లలు మరింత ఇష్టంగా తినడానికి పైన కొద్దిగా తురిమిన చీజ్ లేదా పనీర్, వేయించిన పల్లీలు చల్లితే క్రంచీగా, ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టిఫిన్‌ను టమాటా సాస్ లేదా పుదీనా చట్నీతో వడ్డిస్తే పిల్లలు ప్లేట్ ఖాళీ చేసేస్తారు. పోషకాలతో కూడిన ఈ బ్రేక్‌ఫాస్ట్ రోజంతా చురుగ్గా ఉంచడానికి బాగా తోడ్పడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us