Chicken: చికెన్‌లోని ఈ పార్ట్స్‌ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అందులో చికెన్ అంటే మహా ఇష్టం. అయితే చికెన్ లవర్స్ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ హెచ్చరిక ఇది. కోడి మాంసంలో కొన్ని భాగాలను తింటే ప్రాణాంతక రోగాలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకీ చికెన్ వండేటప్పుడు, తినేటప్పుడు అస్సలు ముట్టుకోకూడని ఆ డేంజరస్ పార్ట్స్ ఏంటో తెలుసుకుందాం..

Chicken: చికెన్‌లోని ఈ పార్ట్స్‌ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
Dangerous Parts Of Chicken

Updated on: Jun 19, 2026 | 8:54 PM

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. నాన్‌వెజ్‌ ప్రియుల మొదటి ఛాయిస్ చికెన్. కొంతమందికి అయితే చికెన్ అంటే పిచ్చి. లెగ్ పీస్, వింగ్స్, బిర్యానీ అంటూ వారంలో కనీసం రెండు మూడు సార్లైనా చికెన్ వండుకుని లొట్టలేసుకుంటూ తింటుంటారు. అయితే చికెన్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కోడి శరీరంలోని కొన్ని భాగాలను మాత్రం అస్సలు తినకూడదని క్లినికల్ డైటీషియన్ గీతాంజలి మెంగి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆ భాగాలలో బ్యాక్టీరియా, పరాన్నజీవులు, ప్రమాదకరమైన కెమికల్స్ ఎక్కువగా పేరుకుపోతాయని, వాటిని తింటే క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వచ్చే ముప్పు ఉందని చెబుతున్నారు. చికెన్ తినేటప్పుడు పక్కన పెట్టేయాల్సిన ఆ ప్రమాదకరమైన భాగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:

చికెన్ స్కిన్

చాలా మంది చికెన్ ఫ్రైస్ లేదా తందూరి చేసుకునేటప్పుడు స్కిన్‌తో కలిపి వండుకోవడానికి ఇష్టపడతారు. దీనివల్ల ముక్క క్రిస్పీగా ఉంటుందని అనుకుంటారు. కానీ చికెన్ స్కిన్‌లో పూర్తిగా సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. దీనితో పాటు కోళ్లకు ఇచ్చే యాంటీబయాటిక్స్, గ్రోత్ హార్మోన్ల తాలూకు అవశేషాలు చర్మంలోనే ఎక్కువగా పేరుకుపోతాయి. ఇది తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.

కోడి ఊపిరితిత్తులు

చికెన్ క్లీన్ చేసేటప్పుడు చాలా మంది లివర్ అనుకుని ఊపిరితిత్తులను కూడా అలాగే ఉంచేస్తుంటారు. కానీ కోడి ఊపిరితిత్తులలో అనేక రకాల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు నివసిస్తాయి. వీటిని ఎంత ఉడికించినా కొన్ని రకాల బ్యాక్టీరియాలు నశించవు. ఈ భాగాలను తినడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, డయేరియా వంటి శ్వాసకోశ, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి.

కోడి తోక భాగం

కోడి తోక భాగంలో ఒక రకమైన గ్రంధి ఉంటుంది. ఇది కోడి శరీరంలోని వ్యర్థాలను, పరాన్నజీవులను, బ్యాక్టీరియాలను నిల్వ చేస్తుంది. ఈ భాగం తినడానికి ఎంత టేస్టీగా అనిపించినప్పటికీ.. ఆరోగ్య పరంగా ఇది అత్యంత హానికరమైనది. దీనివల్ల శరీరంలో టాక్సిన్స్ చేరి లాంగ్ టర్మ్‌లో క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోడి మెడ

చికెన్ ముక్కల్లో మెడ భాగం చాలా మందికి ఇష్టం. అయితే కోళ్లను పెంచేటప్పుడు వాటికి ఇచ్చే వ్యాక్సిన్లు, గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లను ఎక్కువగా మెడ భాగంలోనే ఇస్తుంటారు. దీనివల్ల ఆ కెమికల్స్ అన్నీ మెడలోని గ్రంధులలో డిపాజిట్ అయిపోతాయి. మనం ఆ భాగాలను తిన్నప్పుడు ఆ హార్మోన్లు నేరుగా మన శరీరంలోకి ప్రవేశించి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి ఇకపై చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ భాగాలను అవాయిడ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us