Coconut Milk Biryani : కోనసీమ స్టైల్ లో కొబ్బరి పాలతో టేస్టీ టేస్టీ కొబ్బరి బిర్యానీ తయారీ..

Coconut Milk Biryani : అన్నం, కూరలు రోజు ఇవేనా అంటూ పిల్లలే కాదు.. ఒకొక్కసారి పెద్దలు కూడా అంటారు. అందుకనే వారానికి ఒకసారైనా డిఫరెంట్ స్టైల్ లో వంటలు చేసి..

Coconut Milk Biryani : కోనసీమ స్టైల్ లో కొబ్బరి పాలతో టేస్టీ టేస్టీ కొబ్బరి బిర్యానీ తయారీ..
Coconut Milk Bityani

Updated on: Jun 13, 2021 | 2:13 PM

Coconut Milk Biryani : అన్నం, కూరలు రోజు ఇవేనా అంటూ పిల్లలే కాదు.. ఒకొక్కసారి పెద్దలు కూడా అంటారు. అందుకనే వారానికి ఒకసారైనా డిఫరెంట్ స్టైల్ లో వంటలు చేసి పెడితే.. కుటుంబ సభ్యులు హ్యాపీగా తినేస్తారు. ఈరోజు కొబ్బరి రైస్ తయారీ గురించి తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

పచ్చి కొబ్బరి చెక్కలు :2
బియ్యం -1/2 కేజీ
లవంగాలు -3
యాలకులు -3
దాల్చిన చెక్క-చిన్న ముక్క
జీడిపప్పు
ఉల్లిపాయలు -2పెద్ద ముక్కలు
పచ్చి మిర్చి -5
నెయ్యి -రెండు స్పూన్లు
నూనె -రెండు స్పూన్లు
ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసుకుని మిక్సిలో వేసుకోవాలి.. అప్పుడు దాని నుంచి పాలు తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలా ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు చొప్పున కొలత తీసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద గిన్నె పెట్టి.. నెయ్యి నూనె వేసుకుని ముందుగా పచ్చి మిర్చి ముక్కలను వేసుకోవాలి. తర్వాత జీడీ పప్పు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ముక్కలు వేసుకుని పచ్చి స్మెల్ పోయేవరకూ పోయేవరకూ వేయించుకుని రెండు గ్లాసుల బియ్యాన్ని పోపు మిశ్రమంలో వేసుకుని కొంచెం వేయించాలి. తర్వాత బియ్యం వేసిన గ్లాస్ తోనే నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఉప్పు చూసి .. మూత పెట్టాలి. స్విమ్ లో పెట్టి ఉడికిస్తే కొబ్బరి అన్నం రెడీ.. పైన ఇష్టమైన వారు కొత్తిమీద వేసుకోవచ్చు. ఈ రైస్ లోకి చికెన్ కూర, లేదా బంగాళ దుంప కూరా బాగుంటుంది.

Also Read: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్.. త్వరలో కరోనాపై అప్రమత్తం ఉండలని సూచన

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us