Cinnamon Tea: దాల్చిన చెక్క టీ తాగితే ఇన్ని లాభాలా..? శరీరంలో వచ్చే మార్పులు చూస్తే..

దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేయడంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది కూడా. ఋతుక్రమ సమస్యలకు చెక్ పెడుతుంది. దాల్చిన చెక్క హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

Cinnamon Tea: దాల్చిన చెక్క టీ తాగితే ఇన్ని లాభాలా..? శరీరంలో వచ్చే మార్పులు చూస్తే..
Cinnamon Tea

Updated on: Jun 21, 2025 | 10:08 PM

ప్రతి వంటింటి పోపుల పెట్టేలో తప్పని సరిగా ఉంటుంది దాల్చిన చెక్క. ఇది ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు.. ఆరోగ్యప్రదాయిని అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. దాల్చిన చెక్కలో పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు.. దాల్చిన చెక్క వినియోగంతో బోలెడన్ని ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు. దాల్చిన చెక్క మెరుగైన జ్ఞాపకశక్తి,ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

దాల్చిన చెక్క జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. తిన్నది తేలికగా జీర్ణమవుతుంది. తరచూ దాల్చిన చెక్కతో టీ తయారు చేసుకుని తీసుకోవటం వల్ల రక్తపోటును తగ్గించడంలో, ట్రైగ్లిజరైడ్లు (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది HDL (మంచి) కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. దాల్చిన చెక్క సైతం అదే పని చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేయడంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది కూడా. ఋతుక్రమ సమస్యలకు చెక్ పెడుతుంది. దాల్చిన చెక్క హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us