ఇవి ఆకులు కాదు అద్భుతం.. డైలీ తిన్నారంటే డయాబెటిస్‌కు ఛూమంత్రం వేసినట్లే..

|

Jan 11, 2025 | 9:29 PM

జామపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. రుచిగా ఉండే ఈ జామ పండును చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు.. జామపండులో.. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియం వంటి పోషకాలు జామపండులో పుష్కలంగా ఉన్నాయి. అయితే.. జామపండుతోపాటు.. జామ ఆకుల్లో కూడా తిరుగులేని పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.

ఇవి ఆకులు కాదు అద్భుతం.. డైలీ తిన్నారంటే డయాబెటిస్‌కు ఛూమంత్రం వేసినట్లే..
Guava Leaves
Follow us on

జామపండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. రుచిగా ఉండే ఈ జామ పండును చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు.. జామ పండు తినడం వల్ల చాలా శరీరానికి ఎన్నో పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి.. యాపిల్‌లో ఉండే పోషకాలన్నీ జామపండులో లభిస్తాయని, అందుకే.. డైలీ ఒక పండును తినాలని డైటీషియన్లు చెబుతున్నారు.. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎలాంటి భయం లేకుండా జామపండును తినవచ్చు. ఎందుకంటే.. దీనిలోని పోషకాలు.. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచేందుకు సహాయపడటంతోపాటు జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి.. జామపండులో.. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియం వంటి పోషకాలు జామపండులో పుష్కలంగా ఉన్నాయి. అయితే.. జామపండుతోపాటు.. జామ ఆకుల్లో కూడా తిరుగులేని పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. జామ ఆకులు తీసుకోవడం వల్ల శరీరానికి ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుసుకోండి..

జామాకుల ప్రయోజనాలు..

  1. జామ ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులోని ఫినాలిక్ సమ్మేళనం యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ ఆకులను నమలి.. దాని రసం తీసుకోవడం చాలా మంచిది.
  2. జామ ఆకులను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. జామ పండులాగే, ఆకులలో పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి బీపీ ఉన్నవారు జామ పండు తింటే లేదా ఆకులు నమిలితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
  3. జామ ఆకులను తినడం వల్ల అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఉదర స్థూలకాయ సమస్య ఉన్నవారు ఈ ఆకులను తింటే మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. ఇది మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. దీంతో బరువు సులభంగా తగ్గుతారు.
  4. జామ ఆకులను తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కడుపు ఆరోగ్యాన్ని, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను నివారిస్తుంది.
  5. జామాకుల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.. ప్రాణాంతక క్యాన్సర్‌ను నయం చేసే శక్తి ఈ జామ ఆకులో ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..
  6. జామ ఆకులు చర్మానికి మేలు చేస్తాయి… మొటిమలు, నల్ల మచ్చలు, చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని బిగుతుగా మార్చడంలో, ముడుతలను తగ్గించడంలో సహాయపడతాయి.
  7. జామ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపు పూతల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. దగ్గు, దురద మొదలైన వాటితో బాధపడుతున్నవారు జామ ఆకులను తినడం మంచిది.
  8. ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య దూరమవుతుంది.. దీంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తాయి. ఇది బరువు పెరగడానికి దారితీయదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..