Fish Head: చేప తల తింటే ఏమవుతుంది.. 99శాతం మందికి ఈ విషయం తెలియదు..

చాలా మంది చేపల శరీర భాగాలను మాత్రమే తిని, తలను పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చేప శరీరంతో పోలిస్తే, దాని తలలోనే అత్యధిక పోషకాలు ఉంటాయి. చేప తలలో అత్యధిక పోషకాలు ఉంటాయని, చేప తల తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డైటీషియన్లు చెబుతున్నారు.

Fish Head: చేప తల తింటే ఏమవుతుంది.. 99శాతం మందికి ఈ విషయం తెలియదు..
Fish Head Curry

Updated on: Apr 25, 2026 | 1:54 PM

నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ కంటే చేపలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చేపల్లో ఉండే పోషకాలు ఇతర మాంసాహారంలో లభించవు. అయితే, చాలా మంది చేపలను వండేటప్పుడు లేదా తినేటప్పుడు చేసే ఒక సాధారణ పొరపాటు చేప తలను పక్కన పెట్టేయడం. కానీ ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, చేపల శరీరంతో పోలిస్తే, వాటి తలలోనే అత్యధిక పోషకాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఈ కథనం చదివిన తర్వాత.. చేప తల విషయంలో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు. చేప తల అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలేమిటి.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అందుకే.. చేప తలకాయ పోషకాల గనిగా పేర్కొంటారు డైటీషియన్లు.. . ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.. దీనిని తినడం ద్వారా.. సహజంగా పలు సమస్యలను నివారించవచ్చు..

చేప తలకాయ లాభాలు..

కంటిచూపు మెరుగుదల: చేప తల విటమిన్ ఏ కి అద్భుతమైన వనరు. ఈ విటమిన్ రెటీనా ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, వయసుతో పాటు వచ్చే కంటి సంబంధిత సమస్యలను నివారిస్తుంది. స్పష్టమైన దృష్టిని కోరుకునే వారికి చేప తల ఒక మంచి ఎంపిక.

మెదడు – జ్ఞాపకశక్తి అభివృద్ధి: పిల్లల తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరగాలంటే చేప తల ఒక దివ్యౌషధములా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాలను చురుగ్గా ఉంచుతాయి. ఫలితంగా, మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా, పెద్దవారిలో వచ్చే మతిమరుపు సమస్యలు కూడా తగ్గుతాయి. అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది తోడ్పడవచ్చు.

గుండె ఆరోగ్యం: చేప తల గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఫిష్ హెడ్ లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తనాళాల్లో అడ్డుగోడలు పేరుకుపోకుండా చేసి, హార్ట్ ఎటాక్ రిస్క్ ను గణనీయంగా తగ్గిస్తాయి. అంతేకాదు, రక్తపోటును (బీపీ) నియంత్రణలో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

కిడ్నీలో రాళ్ల నివారణ: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు చేప తల తింటే మంచి ఫలితం ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులోని కొన్ని ప్రత్యేక పోషకాలు కిడ్నీ రాళ్లను కరిగించే శక్తిని కలిగి ఉంటాయని తెలుస్తోంది.

కండరాల బలం – మరమ్మత్తు: శారీరక శ్రమ చేసేవారు, జిమ్ కు వెళ్లేవారు తమ డైట్ లో చేప తలను చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఇందులో ఉండే హై క్వాలిటీ ప్రోటీన్ కండరాల రిపేరింగ్ కు, కొత్త కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది.

ఆర్థరైటిస్ – డయాబెటిస్ ఉపశమనం: ఆర్థరైటిస్, డయాబెటిస్ ఉన్న వారికి కూడా చేప తల తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో మెటబాలిజంను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చేప తల తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, ఇకపై చేప తలను అస్సలు వదలకండి, దానిలోని పోషకాలను సద్వినియోగం చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us