ప్రతి ఇంట్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. దాదాపు అన్ని కూరల్లో వీటిని వేసుకుంటారు. ముఖ్యాంగా నోరూరించే చికెన్, మటన్ వంటి వంటకాల తయారీలో అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా.. వీటితో ఎంత రుచి వచ్చినా.. వీటిని కట్ చేయమంటే మాత్రం నో అంటారు. ఎందుకంటే వీతిని కట్ చేసిన తర్వాత వచ్చే వాసన.. చేతులు కడిగినా పోదు. అయితే ఇలా వదలకుండే ఉండే ఘాటు వాసనలను కొన్ని చిట్కాలతో వదలించుకోవచ్చు.
నిమ్మరసంతో..: అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన చేతుల నుంచి వదలకుండా ఉంటే.. నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం, మీ చేతుల్లో కొన్ని చుక్కల నిమ్మరసం వేసుకోండి.. ఆ తర్వాత చల్లని నీటితో చేతులు కడుక్కోండి.. ఇది వెంటనే వాసనను తొలగిస్తుంది.
చేతులకు ఉప్పు రుద్దండి: మీరు కొంతకాలం క్రితం ఉల్లిపాయ లేదా వెల్లుల్లిని కట్ చేస్తే, అది మీ చేతుల్లో వాసనను వదిలివేస్తుంది. అటువంటి పరిస్థితిలో, దానిని వదిలించుకోవడానికి, మీ చేతులను నానబెట్టి, ఉప్పుతో రుద్దండి. చేతుల మధ్యలో ఉప్పు తీసుకుని రెండు చేతులతో రుద్దాలి. దీంతో వాసనను సులభంగా తొలగించవచ్చు. ఇది కాకుండా, హ్యాండ్‌వాష్ మరియు ఉప్పుతో కలిపి రుద్దడం వల్ల కూడా కొన్ని నిమిషాల్లో వెల్లుల్లి ఉల్లిపాయ వాసనను తొలగించవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం