Lifestyle: ఎండకు చర్మం కందిపోతోందా.? ఇంట్లోనే ఇలా చేయండి..

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటగానే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఎండలో అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎండలో ఎక్కువ సేపు గడపడం వల్ల చర్మం కందిపోతుంది. దీంతో చర్మం నల్లగా మారుతుంది. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇలా చర్మం కందిపోగానే మనలో చాలా మంది...

Lifestyle: ఎండకు చర్మం కందిపోతోందా.? ఇంట్లోనే ఇలా చేయండి..
Lifestyle

Updated on: Apr 12, 2024 | 4:38 PM

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటగానే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఎండలో అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఎండలో ఎక్కువ సేపు గడపడం వల్ల చర్మం కందిపోతుంది. దీంతో చర్మం నల్లగా మారుతుంది. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇలా చర్మం కందిపోగానే మనలో చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్‌లను ఉపయోగిస్తుంటాం. అయితే అలా కాకుండా సహజంగా కొన్ని టిప్స్‌ ద్వారా చర్మం మళ్లీ నిగనిగలాడేలా చేసుకోవచ్చు .ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎండ వల్ల నల్లగా మారిన చర్మానికి బంగాళదుంప ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని బ్లీచింగ్ గుణాలు చర్మానికి పాత రంగును తీసుకొస్తాయి. బంగళాదుంప నుంచి రసాన్ని తీసుకోవాలి. అనంతరం ఆ రసాన్ని ముఖానికి పట్టించి కొన్ని నిమిషాలు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చర్మం కాంతివంగా మారుతుంది.

* పచ్చి పాలు కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అయితే పాలలో కాస్త బియ్యం పిండిని కలిపి కాసేపు అలాగే నానబెట్టాలి. అనంతరం ఆ పేస్ట్‌ను ముఖంపై, మెడపై రుద్ది బాగా మసాజ్‌ చేయాలి. కాసేపు ఇలా ఉంచిన తర్వాత నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

* శనగపిండితో కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. శనగపిండిని తీసుకొని కొద్దిగా నీరు పోసి పేస్ట్‌లా తయారు చేయాలి. అనంతరం అందులో పసుపు వేసి ముఖానికి 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేసుకోవాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది.

* ఇక కుంకుమపువ్వు, పాలు కూడా కందిన చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కుంకుమ పువ్వులో పాలు పోసి బాగా నానబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ముఖాన్ని పట్టించాలి. కాసేపటి తర్వాత నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది. చర్మం నిగనిగలాడుతుంది.

* ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. దద్దుర్లు వస్తాయి, చర్మం డల్‌గా మారుతుంది. అలాగే డీహైడ్రేషన్‌ కారణంగా చర్మం డల్‌గా మారుతుంది. చర్మంపై త్వరగా ముడతలు పడతాయి. అంతేకాదు త్వరగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…