
నార్మల్‌గా ప్రతి ఒక్కరికి తలనొప్పి వస్తుంది.. ఇలాంటి వాటికి చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు ఇదే తలనొప్పి తీవ్రంగా మారవచ్చు అలాంటప్పుడు వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకొని దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ మైగ్రేన్ మాత్రం అలా కాదు.. దీన్ని ఫేజ్ చేసే వాళ్ల పరిస్థితి ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఒక వ్యక్తి తన పనులను తకు కూడా చేసుకోలేడు. ఇది వారిని చాలా తీవ్రంగా బాధిస్తుంది. ఒకప్పుడు ఇది పెద్దవారిలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే యువతో ఈ వ్యాధి పెరగడంపై న్యూరాలజీ, డాక్టర్ కెన్నీ రవీష్ రాజీవ్ మాట్లాడుతూ.. యువతలో మైగ్రేన్‌కు అసలు కారణాన్ని వివరించారు. అంఏటనేవి చూస్తే…
70 శాతం కంటే ఎక్కువ మంది యువతలో మైగ్రేన్ రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి అని ఆయన చెప్పారు. వర్క్ ప్రెజర్, విరామం లేకుండా పనిచేయడం, ఆర్థిక అభద్రత, బిజీ లైఫ్ ఇవన్నీ మన శరీరంలో కార్టిసాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది ఒత్తిడి, తలనొప్పికి దారితీస్తుంది. ఇదే కాలక్రమేనా మైగ్రేన్‌గా మారుతుందని ఆయన తెలిపారు.
ప్రజెంట్ సాంకేతిక యుగంలో ప్రతీది డిజిటలైజేషన్ అయిపోయింది. అందరూ కంప్యూటర్స్ వంటి వాటిని వినియోగిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం తొమ్మిది గంటలు స్క్రీన్‌ల ముందే గడుపుతున్నారు. ఇది కూడా మైగ్రేన్ రావడానికి ఒక ప్రదాన కారణమని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే 18 నుండి 34 సంవత్సరాల వయస్సు వ్యక్తులు రోజుకు ఆరు గంటలకు మించి స్క్రీన్‌లను చూస్తే.. వారికి మైగ్రేన్లు వచ్చే అవకాశం 30 శాతం కంటే ఎక్కువ ఉందని అధ్యాయనాలు చెబుతున్నాయి.
సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా మైగ్రేన్ ప్రమాదాన్ని రెంట్టింపు చేస్తుందట. నైట్ ఫిస్ట్‌లు, రాత్రి పూట ఎక్కువగా ఫోన్ చూడడం, సోషల్ మీడియా రీల్స్ చూడడం మన నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది, దీనివల్ల మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు తలనొప్పి వస్తుంది. ఈ అలవాటు కాలక్రమేణా మిమ్మల్ని మైగ్రేన్‌లకు బానిసలుగా మారుస్తుంది.
కెఫిన్ ఉన్న ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం, టైంకి భోజనం చేయకపోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు మైగ్రేన్‌ల రావడానికి సాధారణ కారణాలు. ఇవే కాకుండా ఐటీ నిపుణులలో ఎక్కువ మంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. ఇవి కూడా మైగ్రేన్ పెరగడానికి కారణమని డాక్టర్ కెన్నీ రవీష్ రాజీవ్ అంటున్నారు.
(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్ట్రైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.