రెండు స్పూన్లు చాలు.. కొవ్వును కోసి పడేస్తాయ్.. కడుపును క్లీన్ చేసే దివ్యాస్త్రం..

మెంతుల్లో ఫైబర్, ప్రోటీన్లు, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కొంత ప్రయోజనం ఉండవచ్చు. అయితే మలబద్ధకం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలను కొంచెం నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

రెండు స్పూన్లు చాలు.. కొవ్వును కోసి పడేస్తాయ్.. కడుపును క్లీన్ చేసే దివ్యాస్త్రం..
Fenugreek Seeds Benefits

Updated on: Nov 18, 2026 | 12:22 PM

భారతదేశ ఆయుర్వేద శాస్త్రం అత్యంత గొప్పది. సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకోగల ఈ శాస్త్రం, సోంపు, యాలకులు, లవంగాలు, మెంతులు వంటి ఇంట్లో లభించే పదార్థాలతో అనేక రోగాలను నయం చేయవచ్చని చెబుతుంది. ప్రస్తుత ఆధునిక వైద్యంలో మందుల పేర్లు, వాటి తయారీ గురించి మనం తెలుసుకోలేనప్పటికీ, ఆయుర్వేదంలో ప్రతి పదార్థం, దాని ప్రయోజనం మనకు సుపరిచితమే. అందుకే పూర్వం ప్రజలు ఆయుర్వేదాన్ని పాటించి ఆరోగ్యంగా జీవించేవారు. ప్రస్తుతం చాలా మంది చిన్న సమస్యలకు కూడా వైద్యులను, మందులను నమ్ముకుంటారు.. ఈ ఆరోగ్య స్పృహ మంచిదే కానీ.. మన ఆరోగ్యం వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకుంటే, ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

80 ఏళ్లు వచ్చినా షుగర్, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, గుండె, కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే, కేవలం ఒక పదార్థాన్ని క్రమం తప్పకుండా వాడితే సరిపోతుంది. కడుపులో పేరుకుపోయే మలినాలు రక్తంలోకి చేరి రక్తాన్ని కలుషితం చేస్తాయి. కార్ ఇంజిన్ ఆయిల్ మారనప్పుడు ఇంజిన్ పాడైనట్లే, రక్తం కలుషితమైతే శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఇది గుండెపోటు వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. గుండెపోటుకు ప్రధాన కారణం రక్తనాళాల్లో అడ్డుపడటం అయినప్పటికీ, దాని వెనుక ఉన్న ముఖ్య కారణం మలబద్ధకం.

రక్తంలో వ్యర్థాలు పేరుకుపోయి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇది రక్తనాళాలను మూసివేసి గుండెపోటుకు కారణమవుతుంది. ఈ సమస్యలను నివారించడానికి ఆయుర్వేద గ్రంథమైన అష్టాంగ హృదయంలో వాగ్భటాచార్య ఒక పదార్థం గురించి ప్రస్తావించారు.. అదే మన ఇంట్లో ఉండే మెంతులు.. మెంతులలో (Fenugreek) ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు..

ఉదయాన్నే తీసుకుంటే..

మెంతులను సరైన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా మెంతుల్ని ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే నిద్రలేవగానే బ్రష్ చేయకుండా, నానబెట్టిన మెంతుల నీటిని తాగి, మెంతులను బాగా నమిలి తినాలి. మెంతులు కొద్దిగా చేదుగా ఉన్నా, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మెంతులను ఇలా తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇది డయాబెటిస్, ఆర్థరైటిస్, జుట్టు రాలడం, ఊబకాయం, అధిక బరువు, కొలెస్ట్రాల్, కిడ్నీ స్టోన్స్ వంటి అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.

మలబద్ధకం నివారణలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఉదయాన్నే రెండు స్పూన్ల నానబెట్టిన మెంతులు తినడంతో పాటు, రాత్రి పడుకునే అరగంట ముందు ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడిని ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇది కడుపును, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త శుద్ధి జరగడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, రక్తనాళాలలోని అడ్డుపడటం క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అలాగే, కిడ్నీలపై భారం తగ్గి, కిడ్నీ స్టోన్స్ తొలగిపోవడానికి సహాయపడుతుంది.

మెంతుల్లో పుష్కలంగా ఉండే ఐరన్ కొత్త రక్తం ఉత్పత్తికి తోడ్పడుతుంది, దీనివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు రెండూ నియంత్రణలో ఉంటాయి. జుట్టు రాలడానికి ప్రధాన కారణం శరీరంలో రక్తం తక్కువగా ఉండటం, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం. మెంతులు ఈ సమస్యను పరిష్కరించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. కాబట్టి, మెంతులను క్రమం తప్పకుండా వాడటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us