Skin Care Tips: 50 ఏళ్ల వయసులో మలైకా అరోరాలా యవ్వనంగా కనిపించాలాని ఉందా.. ఇలా చేస్తే చాలు..

|

Mar 07, 2023 | 9:28 PM

వృద్ధాప్య చాయలను పచ్చి పసుపు ఫేస్ మాస్క్‌తో చెక్ పెట్టొచ్చు.. పచ్చి పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది మీ చర్మంపై యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

Skin Care Tips: 50 ఏళ్ల వయసులో మలైకా అరోరాలా యవ్వనంగా కనిపించాలాని ఉందా.. ఇలా చేస్తే చాలు..
Malaika Arora
Follow us on

కొంత వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్య సంకేతాలు ముఖంపై కనిపిస్తాయి. ఇందులో ముందుగా ముడతలు కనిపిస్తాయి. మీరు ఆరోగ్యకరమైన ఆహారం, చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృద్ధాప్య సంకేతాలను నివారించడానికి ఈ రోజు మేము మీ కోసం పచ్చి పసుపు ఫేస్ మాస్క్‌ని తీసుకువచ్చాం. పచ్చి పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది మీ చర్మంపై యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందువల్ల, ఈ ఫేస్ మాస్క్‌ని ఉపయోగించడం ద్వారా.. మీ ముఖంపై ముడతలను సులభంగా తొలగించవచ్చు.

పచ్చి పసుపు మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల మీరు చాలా కాలం పాటు అందంగా, యవ్వనంగా కనిపిస్తారు. కాబట్టి ముడతలు పోవడానికి పచ్చి పసుపు ఫేస్ మాస్క్ ఎలా చేయాలో (Wrinkles Home Remedies) తెలుసుకుందాం….

పచ్చి పసుపు ఫేస్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు-

  • పసుపు 2 టీస్పూన్ల
  • ఆలివ్ ఆయిల్ 2 టీస్పూన్ల
  • నిమ్మరసం కొద్దిగా

పసుపు ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలి?

  • పసుపు ఫేస్ మాస్క్ చేయడానికి.. ముందుగా పసుపును తీసుకోండి.
  • తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.
  • దీని తరువాత, ఒక గిన్నెలో 2 టీస్పూన్ల పసుపు పొడిని తీసుకోండి.
  • అప్పుడు మీరు దానికి కొద్దిగా నిమ్మరసం, 2 టీస్పూన్ల ఆలివ్ నూనె జోడించండి.
  • దీని తరువాత, ఈ వీటినీ బాగా కలపండి.
  • ఇప్పుడు మీ పచ్చి పసుపు ఫేస్ మాస్క్ సిద్ధంగా ఉంది.

పచ్చి పసుపు ఫేస్ మాస్క్ ఎలా ఉపయోగించాలి?

  • పచ్చి పసుపు ఫేస్ మాస్క్‌ను అప్లై చేసే ముందు ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోండి.
  • తర్వాత ఈ ఫేస్ మాస్క్ ను మీ ముఖానికి బాగా అప్లై చేయండి.
  • దీని తరువాత, దానిని అప్లై చేసి సుమారు 2-5 నిమిషాలు ఆరబెట్టండి.
  • తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడిగి శుభ్రం చేసుకోవాలి.
  • మీరు వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను అప్లై చేస్తే, ముడతలు తగ్గడం ప్రారంభమవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)