తన అందం, అభినయంతో హిందీ ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది ఊర్వశి రౌతేలా. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ హరిద్వార్ ముద్దుగుమ్మ 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో సిల్వర్ స్ర్కీన్పై అడుగుపెట్టింది. ‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్ పంతీ’, ‘వర్జిన్ భానుప్రియ’సినిమాల్లో నటించి మెప్పించింది. త్వరలో ‘బ్లాక్‌రోజ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుందీ అందాల తార. కాగా భారత్ తరఫున 2015లో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొంది. కాగా ఇటీవల ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ‘మిస్‌యూనివర్స్ -2021’ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది ఊర్వశీ. తద్వారా భారత్ తరఫున ఈ గ్రాండ్ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వెళ్లిన అతిపిన్నవయస్కురాలిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. కాగా 2015లో ఇదే మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియా తరఫున తన అదృష్టం పరీక్షించుకున్న ఈ అమ్మడు.. తాజాగా అవే ప్రతిష్ఠాత్మక అందాల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం. ఈ పోటీల్లో మన దేశానికే చెందిన హర్నాజ్ సంధు విశ్వ సుందరి కిరీటం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ అందాల పోటీల అనంతరం ముంబయికి విచ్చేసింది ఊర్వశి. ముంబై విమానాశ్రయంలో బేబీ పింక్ కలర్ డ్రెస్ ధరించి కనిపించింది . ఈ సందర్భంగా కెమెరా కళ్లు ఆమెను క్లిక్‌మనిపించాయి. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా తను ధరించిన డ్రెస్ ధర, విశేషాలు తెలుసుకొని చాలామంది అవాక్కయ్యారు. ఊర్వశి ధరించిన డ్రెస్ ధర సుమారుగా రూ.5లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ డ్రెస్‌లో డైమండ్‌లను కూడా పొందుపరచడం విశేషం. ఆమె ధరించిన చెవి రింగులు కూడా వజ్రాలతోన తయారైనవే. కాగా ఇలా వెరైటీ డ్రెస్‌లు, అవుట్‌ఫిట్‌లతో వార్తల్లో నిలవడం ఊర్వశికి మొదటిసారి కాదు. బాలీవుడ్‌లో ఫ్యాషన్ దివాగా ఆమెకు పేరుంది.
Also Read:
Pushpa The Rise : బన్నీ పడ్డ కష్టం థియేటర్స్‌లో విజిల్స్ కొట్టించడం ఖాయం అంటున్న అభిమానులు..
Chiyaan Vikram : హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్.. సెలబ్రెటీలనూ వదలని మహమ్మారి