Telugu Proverb: ఎవరికి వారే యమునా తీరే..! ఈ సామెత అసలు అర్థం తెలుసా..?

Telugu Proverb Meaning: తెలుగు సామెతలు మనిషి జీవితంలోని అనుభవాలను, విలువైన విషయాలను ఎంతో సరళంగా తెలియజేస్తాయి. అలాంటి సామెతల్లో ఒకటి ‘ఎవరికి వారే యమునా తీరే’. ఈ సామెతను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తారు? దీని వెనుక ఉన్న ఆర్థం ఏమిటి? ఇది మనకు ఇచ్చే సందేశం ఏంటి? రోజువారీ జీవితంలో ఈ సామెతను ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకుందాం.

Telugu Proverb: ఎవరికి వారే యమునా తీరే..! ఈ సామెత అసలు అర్థం తెలుసా..?
Telugu Samethalu
Image Credit source: AI

Updated on: Nov 05, 2026 | 3:51 PM

తెలుగు సామెతల అర్థాలు: తెలుగు భాషలో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. చిన్నచిన్న పదాలతో కూడిన సామెతల్లో లోతైన అర్థం ఉంటుంది. ఎన్నో మాటల్లో చెప్పలేని విషయాన్ని కూడా ఓ సామెతతో ఎదుటి వారికి కళ్లకు కట్టినట్లు వివరించడం సాధ్యమవుతుంది. ఈ సామెతలు మనిషి జీవితానికి సంబంధించిన విలువైన విషయాలను, జీవిత అనుభవాలను తెలియజేస్తాయి. అలాంటి సామెతల్లో ‘ఎవరికి వారే యమునా తీరే’ ఒకటి. రోజువారీ సంభాషణల్లో తరచుగా వినిపించే ఈ సామెత వెనుక ఉన్న అర్థం, దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

సామెత అర్థం ఏమిటి?

‘ఎవరికి వారే యమునా తీరే’ అంటే ఎవరికి వారు తమ గురించి ఆలోచించుకోవడం, ఇతరుల గురించి పట్టించుకోకపోవడం అని అర్థం. ఒకరికి ఒకరు సహాయం చేసుకోకుండా, స్వార్థంతో తమ దారి తాము చూసుకుంటూ వెళ్లే పరిస్థితిని ఈ సామెత ద్వారా వివరిస్తారు. అందరూ కలిసి ఉంటే ఐకమత్యంతో బలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికి వారే విడిపోయి, తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తే సమష్టిగా సాధించగల విజయాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఈ సామెతను ఉపయోగిస్తారు.

ఈ సామెతను ఎప్పుడు ఉపయోగిస్తారు?

ఒక కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య సమస్య వచ్చినప్పుడు, అందరూ కలిసి ఆలోచిస్తే దానికి పరిష్కారం లభిస్తుంది. అయితే అందరూ కలిపి పరిష్కారం వెతకకుండా ఎవరికి వారు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించే సందర్భంలో ఈ సామెతను ఉపయోగించాలి. ఉదాహరణకు.. ఒక అపార్ట్‌మెంట్‌లో నీటి సమస్య ఏర్పడింది. అందరూ కలిసి సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాల్సిన సమయంలో, ప్రతి ఒక్కరూ తమ ఇంటికి నీరు వస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తే.. ‘ఎవరికి వారే యమునా తీరే’ అని చెప్పవచ్చు. అలాగే ఒక కార్యాలయంలో ఉద్యోగులు కలిసి పనిచేయకుండా, తమ పనులు మాత్రమే పూర్తి చేసుకుని ఇతరులకు సహకరించని సందర్భంలోనూ ఈ సామెతను ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ సామెతలోని నీతి ఏమిటి?

మనిషి జీవితంలో ఐకమత్యం, పరస్పర సహకారం ఎంతో ముఖ్యమైనవి. కష్టసమయాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం వల్ల సమస్యలను అభిగమించడం సాధ్యం అవుతుంది. స్వార్థంతో కాకుండా సమష్టి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసినప్పుడే మంచి ఫలితాలు సాధించగలమనే సందేశాన్ని ఈ సామెత తెలియజేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us