Health: ఛాతిలో మంట తగ్గడం లేదా.? రోజూ ఇది తినండి చాలు…

అయితే ఛాతిలో మంట గుండె సంబంధిత సమస్యలకు కూడా లక్షణం కావొచ్చనే భావన చాలా మందిలో ఉంటుంది. అందుకే వెంటనే వైద్యులను సంప్రదిస్తుంటారు. అయితే ఛాతిలో మంట గుండె సంబంధిత సమస్యలకు కారణమనడంలో నిజం ఉన్నా, ప్రతీసారి ఇదే కారణమని మాత్రం చెప్పలేం. అయితే ఈసీజీ వంటి పరీక్షల్లో నార్మల్‌గా ఉన్నా ఛాతిలో...

Health: ఛాతిలో మంట తగ్గడం లేదా.? రోజూ ఇది తినండి చాలు...
Chest Pain
Follow us

|

Updated on: Aug 16, 2024 | 11:40 PM

ఛాతీలో మంట.. మనలో చాలా మందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల్లో ఒకటి. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడే ఉంటారు. తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా, ఎక్కువ పులుపు, మసాలా ఫుడ్‌ తీసుకున్న సమయంలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఛాతిలో నొప్పి ఓ రేంజ్‌లో పెరుగుతుంది. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి ఉంటుంది.

అయితే ఛాతిలో మంట గుండె సంబంధిత సమస్యలకు కూడా లక్షణం కావొచ్చనే భావన చాలా మందిలో ఉంటుంది. అందుకే వెంటనే వైద్యులను సంప్రదిస్తుంటారు. అయితే ఛాతిలో మంట గుండె సంబంధిత సమస్యలకు కారణమనడంలో నిజం ఉన్నా, ప్రతీసారి ఇదే కారణమని మాత్రం చెప్పలేం. అయితే ఈసీజీ వంటి పరీక్షల్లో నార్మల్‌గా ఉన్నా ఛాతిలో మంట వస్తుంటే దానికి జీర్ణ సంబంధిత సమస్యలే కారణని చెప్పాలి. ముఖ్యంగా జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు వస్తుంటాయి. దీని కారణంగా ఛాతితో పాటు గుండెలో అప్పుడప్పుడు బర్నింగ్ సెన్సేషన్‌ ఉంటుంది.

అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు రోజూ పెరుగు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఛాతిలో మంటతో బాధపడేవారు రోజూ పరగడుపు రెండు చెంచాల పెరుగు తీసుకోవాలని చెబుతున్నారు. ఇది ఛాతిలో మంటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే నీరు తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. రోజులో కనీసం 3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక భోజనం చేసిన వెంటనే పడుకోవద్దని కూడా నిపుణులు సూచిస్తున్నారు. తిన్న తర్వాత కనీసం గంట తర్వాతే నిద్రపోవాలని అంటున్నారు.

ఇక తీసుకునే ఆహారం కూడా ఛాతీలో మంటను ప్రేపేరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఫుడ్‌తో పాటు, వేపుళ్లను తీసుకోవద్దని చెబుతున్నారు. రోజూ వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని ఆదరబాదరగా తీసుకోకుండా నెమ్మదిగా పూర్తిగా నమిలిన తర్వాతే మింగాలి. ఇక కాఫీ, కూల్‌డ్రింక్స్‌ సైతం ఛాతిలో మంటకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడమే మంచిది.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..