ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.ఐటీ, మీడియా, బీపీఓ, ఫ్యాషన్ హౌస్, పారిశ్రామిక రంగాల్లో నైట్ షిఫ్ట్ సర్వసాధారణం.
అయితే అన్ని రకాల ఉద్యోగాల్లో రాత్రి సమయంలో విధులు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని చోట్ల నైట్ షిఫ్ట్ అనివార్యం.
రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసే వారికి గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
నైట్ షిఫ్ట్ చేసేవారి జీవనశైలిలో మార్పులు చోటు చేసుకోవడంతో నిద్రలేమి, తీసుకునే ఆహారంలో తేడాల వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు రాత్రిపూట పని చేయడం వల్ల మీ ఆలోచనా సామర్థ్యం తగ్గుతుంది.
నైట్ షిఫ్ట్ చేసేవారు తినే ఆహారం, సమయంలో కూడా మార్పులతో జీర్ణ సమస్యలతో పాటు అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
మతిమరుపుతో సహా అనేక రకాల సమస్యలు వేధించడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఖాళీ సమయంలో ఆటలకు, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వండి.