కడుపు క్లీన్‌గా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా పెరుగు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పులియబెట్టిన ఆహారం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది.
కడుపు ఆరోగ్యాన్ని కాపాడడంలో చియా సీడ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కాల్షియం జీర్ణక్రియ డీటాక్సిఫికేషన్‌లో సహాయపడుతుంది.
పేగులు, కడుపు శుభ్రంగా ఉండాలంటే కచ్చితంగా సరిపడ నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నీరు బాగా తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమై, శరీరంలోని టాక్సిన్లు సులభంగా బయటకుపోతాయి.
కడుపును క్లీన్‌గా మార్చడంలో గ్రీన్ కూడా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఉదయం గ్రీన్ టీ తాగితే కడుపులో ఉన్న విష పదార్థాలన్నీ తొలగిపోతాయి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు కూడా కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పేగు గోడలకు అంటుకున్న పదార్థాలను తొలగించడంలో ఆకు కూరలు కీలక పాత్ర పోషిస్తాయి.
జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలన్నా, కడుపు క్లీన్‌గా ఉండాలన్నా కచ్చితంగా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా యాపిల్, బెర్రీలను తీసుకోవాలి.
తీసుకునే ఆహారంతో పాటు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కచ్చితంగా వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.