Beauty: మొటిమలకు, చేపలకు సంబంధం ఏంటబ్బా.? పరిశోధనల్లో ఆసక్తిర విషయాలు..

చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మొటిమల నివారణ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు, పరిశోధన చేపట్టి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే సాల్మన్, సార్‌డైన్స్‌ వంటి చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మొటిమలు త్వరగా...

Beauty: మొటిమలకు, చేపలకు సంబంధం ఏంటబ్బా.? పరిశోధనల్లో ఆసక్తిర విషయాలు..
Pimples
Follow us

|

Updated on: Aug 16, 2024 | 9:43 PM

అందంగా ఉన్న ముఖంపై ఒక చిన్న మొటిమ ఉన్నా చూడ్డానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. అందుకే మొటిమలు వచ్చాయంటే చాలు యువత తెగ ఖంగారు పడిపోతుంది. ముఖ్యంగా యువతులు మొటిమలు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే ఆయింట్‌మెంట్స్‌ను, క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే తీసుకునే ఆహారం ద్వారా కూడా మొటిమలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మొటిమల నివారణ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు, పరిశోధన చేపట్టి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే సాల్మన్, సార్‌డైన్స్‌ వంటి చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మొటిమలు త్వరగా తగ్గడానికి దోహదపడతాయని తాజా పరిశోధల్లో వెల్లడైంది. తక్కువగా మొటిమలు ఉన్న వారిని పరిగణలోకి విశ్లేషించారు. ఇలాంటి వారిలో 98% మందిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు తేలింది.

కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం, ట్యాబ్లెట్స్‌ను ఇవ్వగా వీరిలో ఫలితం కనిపించింది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఇన్‌ప్లమేషన్‌ ప్రక్రియను తగ్గిస్తాయి. అలాగే చర్మంలో విడుదలయ్యే నూనె ఉత్పత్తిని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఇవి వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను నిరోధించటం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. అయితే దీనిపై మాత్రం కొందరు నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పండ్లు, కూరగాయలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే చేపల్లో వాపును నిలువరించే గుణం ఉండటం గమనార్హం. ఇవి చర్మంపై దురద, మొటిమలు వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాలని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..