గుండె కోసం ఇవి తినండి.. 

Narender Vaitla

16 Aug 2024

ప్రతీ రోజూ రాత్రి కచ్చితంగా ఒక అరటి పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం కంటెంట్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇక బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌లో కూడా మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో బాగా ఉపయోగపడతాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో చాక్లెట్ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ డార్క్‌ చాక్లెట్‌ తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది.

గుండె సేఫ్‌గా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఒమేగా-3 యాసిడ్స్‌ ఉండేలా చూసుకోవాలి. వీటికి పెట్టింది పేరు చేపలు. వారంలో రెండు సార్లైనా చేపలను తీసుకోవాలని చెబుతున్నారు.

ఇక అవిసె గింజలను కూడా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుడుతుంది. ఇందులోని ఒమేగా ఫ్యాటీ3 యాసిడ్స్‌ గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా చూసుకుంటాయి.

విటమిన్‌ డి కూడా గుండె ఆరోగ్యాన్ని కాపడడంలో ఉపయోగడపుతుంది. కాబట్టి సూర్య రక్ష్మి పడేలా చూసుకోవడంతో పాటు.. విటమిన్‌ డి లభించే గుడ్లు, చేపలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

తీసుకునే ఆహారంతో పాటు వ్యాయామం కూడా అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని జీవితంలో ఓ భాగం చేసుకోవాలి. వీటి వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.