Lifestyle: ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?

ఉదయం టీ లేదా పాలలో బ్రెడ్ తినడం సర్వసాధారణమైన విషయం. మరీ ముఖ్యంగా జీవితాలు గజిబిజీగా మారిన ఈరోజుల్లో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా చాలా మంది బ్రెడ్‌ను తీసుకుంటున్నారు. అప్పటికప్పుడు రడీగా ఉంటుంది కాబట్టి బ్రెడ్‌ను తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే...

Lifestyle: ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.? ఏమవుతుందో తెలుసా.?
Eating Bread
Follow us

|

Updated on: Mar 19, 2024 | 4:27 PM

ఉదయం టీ లేదా పాలలో బ్రెడ్ తినడం సర్వసాధారణమైన విషయం. మరీ ముఖ్యంగా జీవితాలు గజిబిజీగా మారిన ఈరోజుల్లో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా చాలా మంది బ్రెడ్‌ను తీసుకుంటున్నారు. అప్పటికప్పుడు రడీగా ఉంటుంది కాబట్టి బ్రెడ్‌ను తీసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఖాళీ కడుపుతో బ్రెడ్‌ను తీసుకుంటే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

* ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే షుగర్‌ వ్యాధితో బాధపడుతుంటే పరగడుపున బ్రెడ్ తీసుకోకూడదని సూచిస్తున్నారు. వైట్ బ్రెడ్‌ త్వరగా జీర్ణమవుతుంది ఈ కారణంగా అది గ్లూకోజ్‌గా మారుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఈ బ్రెడ్‌లో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

* గ్రెయిన్స్ ఫుడ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం, బ్రెడ్‌లో ఫోలేట్, ఫైబర్, ఐరన్, విటమిన్ బి ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్రెడ్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే పరగడపున తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

* ఖాళీ కడుపుతో బ్రెడ్ తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయిని నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్‌లో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. ఇది శరీరంలోని కేలరీలను పెంచడంతో పాటు బరువును కూడా పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో బ్రెడ్ తీసుకోకూడదు.

* ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తింటే పేగు సంబంధిత సమ్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మలబద్ధకం సమస్య వెంటాడుతుందని చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా ఉండే పిండి పదార్థం దీనికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..