కొబ్బరి పగలకుండా మొత్తం బయటకు రావాలంటే.. ఈ సింపుల్ చిట్కా పాటించండి!

కొబ్బరిని పగలగొట్టిన తర్వాత పెంకు నుంచి కొబ్బరి చిప్పను విడదీయడం చాలామందికి కష్టమైన పని. ఈ సమస్యకు కుక్కర్‌లో ఆవిరి పట్టే సులభమైన చిట్కా ఉపయోగపడుతుంది.ఈ చిట్కాత కొబ్బరి పెంకు నుంచి సులభంగా ఊడి వస్తుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే చెక్క కర్రతో తేలికగా తట్టడం లేదా చాకుతో అంచులు వేరు చేయడం ద్వారా కొబ్బరి చెక్కులకుండా వస్తుంది. ఆ తర్వాత నల్లటి పొర తొలగించి మిక్సర్‌లో పల్స్ మోడ్‌లో రుబ్బితే మృదువైన తురుము రెడీ అవుతుంది.

కొబ్బరి పగలకుండా మొత్తం బయటకు రావాలంటే.. ఈ సింపుల్ చిట్కా పాటించండి!
How To Remove Coconut From

Updated on: Nov 26, 2026 | 10:43 AM

వంటగదిలో చట్నీలు, స్వీట్లు, వివిధ రకాల వంటకాల తయారీలో పచ్చి కొబ్బరి ఎంతో అవసరం. కానీ కొబ్బరిని పగలగొట్టిన తర్వాత పెంకుకు అతుక్కున్న కొబ్బరిని విడదీయడం చాలామందికి పెద్ద పనిలా అనిపిస్తుంది. తరచుగా కొబ్బరి ముక్కలుగా విరిగిపోవడంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతుంది. ఇలాంటి సమయంలో కుక్కర్ సహాయంతో కొబ్బరిని సులభంగా ఎలా వేరు చేయాలో, మృదువైన తురుము ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి పగలగొట్టే సరైన విధానం

ముందుగా ఒలిచిన కొబ్బరిపై ఉన్న మందపాటి గీతను గమనించాలి. ఆ గీతపై సుత్తితో రెండు మూడు సార్లు తేలికగా తడితే కొబ్బరి సాధారణంగా రెండు సమాన భాగాలుగా విడిపోతుంది. లోపలి కొబ్బరి నీళ్లను ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. సరిగ్గా గీతపై కొట్టడం వల్ల రెండు భాగాలు సులభంగా వస్తాయి.

కుక్కర్‌లో ఆవిరి పట్టే సులభమైన ట్రిక్

కొబ్బరిని పెంకు నుంచి వేరు చేయడానికి కుక్కర్‌ను ఉపయోగించవచ్చు:

కుక్కర్‌లో ఒక గ్లాసు నీళ్లు పోసి, అందులో స్టాండ్ పెట్టి దానిపై కొబ్బరి ముక్కలను బోర్లా ఉంచాలి. మూత పెట్టి తక్కువ నుంచి మధ్యస్థ మంటపై వేడి చేయాలి. విజిల్ రాకముందే ఆవిరి బయటకు రావడం మొదలవగానే స్టవ్ కట్టేయాలి. మూత తీయకుండా దాదాపు 10 నిమిషాలు అలాగే ఉంచాలి పాన్‌లో అయితే సుమారు 20 నిమిషాలు పట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

వేడిగా ఉన్నప్పుడే విడదీయాలి

కుక్కర్ నుంచి బయటకు తీసిన తర్వాత కొబ్బరి పూర్తిగా చల్లారే వరకు ఆగకూడదు. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే పెంకు మందపాటి భాగంపై చెక్క కర్రతో మెల్లగా తడితే కొబ్బరి సులువుగా విడిపోతుంది. అలా రాకపోతే చాకు సహాయంతో అంచుల వెంట జాగ్రత్తగా వేరు చేయవచ్చు. ఆవిరి వల్ల పట్టు సడలుతుంది కాబట్టి కొబ్బరి విరిగిపోకుండా వస్తుంది. చాకు వాడేటప్పుడు చేతులకు గాయం తగలకుండా జాగ్రత్త పడాలి.

నల్లటి పొర తొలగింపు, తురుము తయారీ

కొబ్బరిని శుభ్రమైన గుడ్డతో తుడిచి, పీలర్ సహాయంతో దానిపై ఉండే నల్లటి పొరను తీసేస్తే తెల్లగా ఉంటుంది. ఆవిరి కారణంగా కొబ్బరి కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్న ముక్కలుగా కోయడం తేలికవుతుంది. వాటిని మిక్సర్ జార్‌లో వేసి, ఒకేసారి కాకుండా పల్స్ మోడ్‌లో రెండు మూడు సార్లు ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేస్తే పేస్ట్‌లా కాకుండా మృదువైన, తెల్లని కొబ్బరి తురుము సిద్ధమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us