Garlic: ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును ఈజీగా వలవొచ్చు..

కేజీల కొద్దీ వెల్లుల్లిని వేళ్లు, గోర్లు నొప్పి లేకుండా సులువుగా వలవడానికి మూడు పద్ధతులు ఉన్నాయి. టూత్ పిక్, పిన్నీస్, నెయిల్ కట్టర్‌ను ఉపయోగించి వెల్లుల్లి పొట్టును తేలికగా ఎలా తీయాలో ఇక్కడ తెలుసుకోండి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి.

Garlic: ఒక్క టూత్‌పిక్ చాలు.. వేళ్లకు నొప్పి లేకుండా వెల్లుల్లి పొట్టును ఈజీగా వలవొచ్చు..
Garlic

Updated on: Apr 04, 2026 | 11:54 AM

రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ బయాటిక్ గుణాలు పుష్కలంగా ఉండే వెల్లుల్లిని కేవలం రుచి కోసమే కాకుండా, రోగ నిరోధక శక్తిని పెంచే సంజీవనిలా ఉపయోగిస్తున్నారు. గుండె ఆరోగ్యం నుండి చర్మ సౌందర్యం వరకు వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. వంట గదిలో వెల్లుల్లి వలవడమంటే చాలా మందికి విసుగు పుట్టించే పని. కేజీల కొద్దీ వెల్లుల్లిని వేళ్లు లేదా గోర్లకు నొప్పి లేకుండా సులువుగా వలవడానికి మూడు పద్దతులు ఉన్నాయి.

సాధారణంగా వెల్లుల్లి వలిచేటప్పుడు గోర్లు నొప్పి పుడుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, వెల్లుల్లి రెబ్బల నుంచి పొట్టును సులభంగా తీయడానికి ఈ పద్దతులు ఫాలో అవ్వొచ్చు. మొదటి పద్ధతిలో ఒక టూత్ పిక్‌ను ఉపయోగించి వెల్లుల్లి రెబ్బ పై భాగాన కొద్దిగా నొక్కి, బయటికి లాగడం ద్వారా పొట్టు సులభంగా ఊడివస్తుంది. ఇలా చేయడం ద్వారా ఎన్ని కేజీలు వలిచినా అలసట ఉండదు. రెండవ పద్ధతిలో, పిన్నీస్‌ను ఉపయోగించి టూత్ పిక్ మాదిరిగానే పై భాగాన నొక్కి పొట్టును లాగితే అది తేలికగా వచ్చేస్తుంది. మూడో పద్ధతిలో, నెయిల్ కట్టర్‌ను ఉపయోగించి కూడా వెల్లుల్లి పొట్టును చాలా తేలికగా తీయవచ్చు. ఈ మూడు పద్ధతుల్లో దేనిని ఉపయోగించినా పని సులభంగా పూర్తవుతుంది. ఒకేసారి ఒక నెలకు సరిపడా వెల్లుల్లిని వలిచి, ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.

ఇది చదవండి: ఇలా చేస్తే దోసెలు పెనానికి జన్మలో కూడా అతుక్కోవు.. ఎలాగో మీరూ చూడండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us