Kitchen Hacks: షాప్‌కు వెళ్లే పనిలేదు.. మొద్దుబారిన మిక్సీ బ్లేడ్‌లను ఇంట్లోనే ఇలా షార్ప్‌గా మార్చండి!

Updated on: May 02, 2026 | 4:58 PM

మీ మిక్సీ బ్లేడ్ మొద్దుబారిందా? కొత్త మిక్సీని కొనే ఆలోచనలో ఉన్నారా? తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీ ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి, మొద్దుబారిన మిక్సీ బ్లేడ్‌ను సైతం మీరు పదునుగా మార్చుకోవచ్చు. అవును మిక్సీని ఎక్కువగా వాడడం వల్ల కొన్ని సార్లు వాటి బ్లేడ్స్ అరగిపోతాయి. అలాంటప్పుడు చాలా మంది కొత్తవి కొనాలని చూస్తారు. కానీ ఇంట్లోనే ఈ బ్లేడ్‌లను కొత్త మిక్సీ బ్లేడ్‌ల లాగే సులభంగా పదును పెట్టుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఐస్ క్యూబ్స్: మీ మిక్సీ బ్లేడ్‌లను పదును పెట్టడానికి మీరు ఐస్‌ను ఉపయోగించవచ్చు. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఇందు కోసం మీరు మిక్సర్ జార్‌లో 3-4 ఐస్ క్యూబ్స్ వేసి, కొన్ని సెకన్ల పాటు మిక్సీ పట్టండి. ఈ ఐస్ మీ మిక్సీలోని మొద్దుబారీన బ్లేడ్‌లను శుభ్రం చేయడమే కాకుండా, వాటికి పదును పెడుతుంది. దీంతో మీరు కొత్తది కొనే పనిలేకుండానే మీ మిక్సీ బ్లేడ్‌లు షార్ప్‌గా అవుతాయి.

2 / 5
గుడ్డు పెంకులు: మిక్సీ బ్లేడ్‌లు మొద్దుబారితే, మీరు కోడిగుడ్డు పెంకులను ఉపయోగించి కూడా వాటిని షార్ప్‌గా చేయవచ్చు. ఇందుకోసైం మీరు ఉండికించిన గుడ్డు పెంకులను కడిగి, వాటిని ఎండలో ఆరబెట్టండి. వాటిలోని మురికి లేదా వాసన లేకుండా చేసిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌లో వేసి కొన్ని సెకన్ల పాటు మిక్సీ ఆన్ చేయండి. ఇది బ్లేడ్‌లను బాగా పదును పెడుతుంది.

3 / 5
కల్లుప్పు: మీ ఇంట్లో కల్లుప్పు ఉంటే, దానిని కూడా ఉపయోగించి మీరు మొద్దుబారీన మిక్సీ బ్లేడ్స్‌ను షార్ప్‌గా మార్చొచ్చు. ఇందుకోసం మీరు మిక్సీ జార్‌లో ఒక స్పూన్ కల్లుప్పు వేసి, కొన్ని సెకన్ల పాటు మిక్సీ ఆన్ చేసి పెట్టండి. ఇది బ్లేడ్‌ను పదును పెట్టి, మెరుగ్గా పని చేసేలా చేస్తుంది.

4 / 5
బేకింగ్ సోడా: వంట సోడా మిక్సీ బ్లేడ్‌లను శుభ్రంగా, పదునుగా చేయడంలో సూపర్‌గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు  కొద్దిగా వంట సోడా తీసుకొని అందులో కొంత నీటిని కలిపి గట్టి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను బ్రష్ సహాయంతో బ్లేడ్‌లకు పట్టించండి. 5 నిమిషాల తర్వాత, నీటితో కడిగేయండి. ఇది బ్లేడ్‌లను శుభ్రపరచడమే కాకుండా పదును పెడుతుంది.

5 / 5
అల్యూమినియం ఫాయిల్: అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించి కూడా మిక్సీ జార్‌ను పదును పెట్టవచ్చు. ఇందుకోసం మీరు చిన్న అల్యూమినియం ఫాయిల్ ముక్కను తీసుకుని, దాన్ని మడతపెట్టండి. ఇప్పుడు ఈ ఫాయిల్‌ను మిక్సీ జార్‌లో వేసి కొన్ని సెకన్ల పాటు మిక్సీ పట్టండి. ఫాయిల్ గరుకుగా ఉండటం వల్ల, ఇది బ్లేడ్‌లను బాగా పదును పెడుతుంది. దీని వల్ల మిక్సీ బ్లేడ్స్ షార్ప్‌గా మారుతాయి.

Follow Us