
గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది భయపడుతుంటారు. కానీ, ఆధునిక శాస్త్రం ప్రకారం రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల ఎటువంటి ముప్పు లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, గుడ్డుకు కొన్ని ప్రత్యేకమైన పోషకాలను జోడించడం ద్వారా దానిని ఒక ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పవర్‌హౌస్‌గా మార్చవచ్చు. మీ ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షించే ఈ చిట్కాలను డాక్టర్ సేథీ ఎలా వివరించారో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సౌరభ్ సేథీ, గుడ్డు పోషక విలువలను రెట్టింపు చేస్తూ ప్రేగుల ఆరోగ్యాన్ని పదిలపరిచే ఐదు సులభమైన మార్గాలను సూచించారు.
పచ్చసొనపై భయం వద్దు రెండు పూర్తి గుడ్లను తీసుకోండి. పచ్చసొనలోని కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. పాతకాలపు అంచనాల కంటే భిన్నంగా, నేటి పరిశోధనల ప్రకారం రోజూ రెండు పచ్చసొనలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
సీక్రెట్ కాంబినేషన్ గుడ్డు మిశ్రమంలో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలపండి. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను శరీరానికి అందేలా చేయడంలో మిరియాల పొడి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రేగులకు ఎంతో మేలు చేసే చిట్కా.
ఉప్పు వాడకం రుచి కోసం ఉప్పును జోడించండి. అయితే, దానిని వీలైనంత తక్కువగా ఉండేలా (లైట్) చూసుకోవాలని డాక్టర్ హెచ్చరిస్తున్నారు.
కూరగాయల జోడింపు మీకు నచ్చిన టమోటాలు, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు లేదా ఆలివ్స్ వంటి కూరగాయలను చేర్చండి. దీనివల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ (పీచు పదార్థం), యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఇవి మీ కడుపులోని సూక్ష్మజీవుల (Microbes) పెరుగుదలకు తోడ్పడతాయి.
వంట చేసే విధానం గుడ్లను మరీ ఎక్కువగా నూనెలో వేయించకుండా తక్కువ వేడిపై వండాలి. మీకు నచ్చిన విధంగా ఆమ్లెట్ లేదా స్క్రాంబుల్డ్ ఎగ్స్‌గా చేసుకోవచ్చు. నూనె అతిగా వాడకుండా పదార్థాల సహజ రుచి దెబ్బతినకుండా చూసుకోవాలి.