Lifestyle: వెన్నునొప్పిని లైట్‌ తీసుకుంటున్నారా.?

వెన్ను నొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. సరిగ్గా కూర్చోకపోవడం తరచుగా వెన్నునొప్పికి కారణమవుతుంది. సరిగ్గా కూర్చోవడం, నిలబడి ఉన్న భంగిమ కూడా వెన్నునొప్పికి కారణమవుతుంది. కండరాల ఒత్తిడి కూడా వెన్నునొప్పికి కారణమయ్యే అవకాశం ఉంది. వెన్ను నొప్పుల్లో హెర్నియేటెడ్ డిస్క్ ఒకటి...

Lifestyle: వెన్నునొప్పిని లైట్‌ తీసుకుంటున్నారా.?
Back Pain

Updated on: Mar 12, 2024 | 11:10 PM

మనలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో వెన్ననొప్పి సాధారణమైంది. అయితే ఈ సమస్య దీర్ఘకాలంగా కొనసాగితే అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వెన్ననొప్పిని నిర్లక్ష్యం చేస్తే పలు సమస్యలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు. తీవ్రమైన వ్యాధికి వెన్నునొప్పి ప్రారంభ లక్షణంగా భావించాలని చెబుతున్నారు. ఇంతకీ వెన్నునొప్పి ఎలాంటి వ్యాధులకు లక్షణమో ఇప్పుడు తెలుసుకుందాం..

వెన్ను నొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. సరిగ్గా కూర్చోకపోవడం తరచుగా వెన్నునొప్పికి కారణమవుతుంది. సరిగ్గా కూర్చోవడం, నిలబడి ఉన్న భంగిమ కూడా వెన్నునొప్పికి కారణమవుతుంది. కండరాల ఒత్తిడి కూడా వెన్నునొప్పికి కారణమయ్యే అవకాశం ఉంది. వెన్ను నొప్పుల్లో హెర్నియేటెడ్ డిస్క్ ఒకటి ఇందులో వెన్నెముక ఎముకల మధ్య ఖాళీ స్థలం ఏర్పడే అవకాశం ఉంటుంది. మృదువైన ద్రవం సన్నబడటం ప్రారంభమవుతుంది, దీని వలన అది చీలిపోతుంది. దీంతో డిస్క్‌లు ఉబ్బడం వెన్ను నొప్పికి కారణమవుతుంది.

ఇక దీర్ఘకాలంగా వెన్ననొప్పితో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే కూర్చోవడం, నడవడం కూడా ఇబ్బందిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. నిదురించే భంగిమ కూడా సరిగ్గా లేకపోయినా వెన్ను నొప్పి వేధిస్తుంటుంది. అతిగా ఫోన్‌ వాడడం, ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం కారణంగా కూడా వెన్నునొప్పి వస్తుంది.

వెన్న నొప్పి రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ఎంత చురుకుగా ఉంటే, మీ రక్త ప్రసరణ బాగా పని చేస్తుంది. వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే రోజూ వర్కవుట్స్‌ చేయాలి. అయితే ఒకే రోజులో పెద్దగా కాకుండా చిన్నచిన్నగా వ్యాయామాలు చేయాలి. యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..